Abhishek Sharma : అభిషేక్ శర్మ బ్యాట్ స్టోరీ తెలుసా..? మెరుపు శతకం చేసింది తన బ్యాట్‌తో కాదట.. మరి ఎవరిదంటే..?
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొట్టాడు యువ ఆటగాడు అభిషేక్ శర్మ.

Abhishek Sharma Didnt Use His Own Bat against Zimbabwe in second T20
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొట్టాడు యువ ఆటగాడు అభిషేక్ శర్మ. విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడడంతో జింబాబ్వే పర్యటనకు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే.. తన అరంగ్రేట మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఎలాంటి నిరాశకు గురి కాకుండా రెండో టీ20 మ్యాచ్‌లో సత్తా చాటాడు. తనదైన ఆటతీరుతో జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం 46 బంతుల్లో సెంచరీని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
అయితే.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్ తనది కాదట. జింబాబ్వే పర్యటనకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్ బ్యాట్‌తోనే ఈ ఇన్నింగ్స్ ఆడాడట. ఈ విషయాన్ని స్వయంగా అభిషేక్ శర్మ చెప్పాడు. మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. గిల్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించాడు. అండర్-12 కేటగిరీ నుంచే గిల్, తాను కలిసి ఆడుతున్నట్లుగా చెప్పాడు. తాను భారత జట్టుకు ఎంపిక కాగానే తనకు మొదటగా ఫోన్ చేసింది గిల్ అని తెలిపాడు.
ఇక ఈ మ్యాచ్‌లో గిల్ బ్యాట్‌తోనే ఆడినట్లు చెప్పాడు. ఇందుకు అతడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న మ్యాచుల్లో గిల్ బ్యాట్‌ను అడిగి తీసుకుంటానని, అతడి బ్యాట్‌తోనే ఆడతానని అన్నాడు. అండర్-12 రోజుల నుంచి ఇది కొనసాగుతుందని వివరించాడు. ఐపీఎల్ మ్యాచుల్లో సైతం అతడి బ్యాట్ తీసుకుని ఆడానన్నాడు. ఇక దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ తనకు ఎంతో అండగా నిలిచాడన్నారు.
సిక్సర్ల కింగ్ లేదా మరో విధంగా తనను తాను ఊహించుకోనని చెప్పాడు. ఇక లాప్టెడ్ షాట్ ఆడేందుకు అనుమతించిన తన తండ్రికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ‘నాన్న ఎల్లప్పుడూ ఓ విషయం చెప్పేవాడు. లాప్టెడ్ షాట్ ఆడాలనుకుంటే ఆ బంతి మైదానం బయట ఉండాలనేవారు. ఈ మ్యాచ్‌లో నా ప్లాన్ వర్కౌట్ అయింది.’ అని అభిషేక్ శర్మ అన్నాడు.
Two extremely special phone ? calls, one memorable bat-story ? & a first ? in international cricket!
?? ??? ????!
A Hundred Special, ft. Abhishek Sharma ? ? – By @ameyatilak
WATCH ? ? #TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/0tfBXgfru9
— BCCI (@BCCI) July 8, 2024