Neymar : వామ్మో.. ఒక్క‌సారి కూడా క‌ల‌వ‌కుండానే.. 10 వేల కోట్ల ఆస్తిని ఫుట్‌బాల్ స్టార్‌కి రాసిచ్చిన ఓ వ్యాపార వేత్త‌..

బ్రెజిల్ ఫుట్‌బాల్ సూప‌ర్ స్టార్ నెయ్‌మ‌ర్ (Neymar)కు ఓ వ్యాపార వేత్త త‌న ఆస్తి రూ.10వేల కోట్ల‌ను రాసిచ్చేశాడు.

Neymar : వామ్మో.. ఒక్క‌సారి కూడా క‌ల‌వ‌కుండానే.. 10 వేల కోట్ల ఆస్తిని ఫుట్‌బాల్ స్టార్‌కి రాసిచ్చిన ఓ వ్యాపార వేత్త‌..

Billionaire Leaves Entire US$1B Fortune to Neymar

Updated On : September 6, 2025 / 2:21 PM IST

Neymar : మ‌న దేశంలో క్రికెట్ అంటే ఓ ఆట కాదు ఓ మతంలా భావిస్తూ ఉంటారు. అయితే.. విదేశాల్లో మాత్రం క్రికెట్ కంటే ఎక్కువ‌గా ఫుట్‌బాల్‌ను ఇష్ట‌ప‌డుతుంటారు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆట ఏదైన గానీ, త‌మ‌కు న‌చ్చిన ఆట‌గాళ్ల‌ను ఫ్యాన్స్ అభిమానించ‌డంతో పాటు ఆరాధిస్తూ ఉంటారు. వారి కోసం ఏం చేయ‌డానికైనా వెనుకాడరు.

బ్రెజిల్ ఫుట్‌బాల్ సూప‌ర్ స్టార్ నెయ్‌మ‌ర్ (Neymar)కు ఉన్న ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఓ వ్యాపార వేత్త ఈ స్టార్ ఆట‌గాడిని ఒక్క‌సారి కూడా క‌ల‌వ‌కుండానే త‌న‌కు ఉన్న వేల కోట్ల రూపాయ‌ల ఆస్తిని నెయ్‌మ‌ర్‌కు రాసి ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ODI World Cup 2025 : వరల్డ్ కప్ ఓపెనింగ్ కి పాకిస్తాన్ డుమ్మా..!

బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రిలో 31 ఏళ్ల ఓ వ్యాపార వేత్త నివ‌సిస్తూ ఉండేవాడు. అత‌డికి భార్య‌, పిల్ల‌లు లేరు. అతడికి ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్ అంటే ఎంతో ఇష్టం. అత‌డి వ్య‌క్తిత్వం న‌చ్చి త‌న సంప‌ద అంతా అంటే 6.1 బిలియ‌న్ బ్రెజిల్ రియ‌ల్స్ (భార‌త క‌రున్సీలో దాదాపు రూ.10వేల కోట్లు) అత‌డికి చెందాల‌ని వీలునామా రాశాడు.

ఇటీవ‌ల స‌ద‌రు వ్యాపార వేత్త మ‌ర‌ణించాడు. ఆ వీలునామాలో ఇలా ఉంది. ‘నాకు నెయ్‌మార్ అంటే ఎంతో ఇష్టం. అత‌డిలో న‌న్ను నేను చూసుకుంటాను. అత‌డు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటాడు. అత‌డిలో కొంచెం కూడా గ‌ర్వం ఉండ‌దు. అత‌డు కుటుంబానికి చాలా విలువ ఇస్తాడు. తండ్రితో అత‌డికి ఉన్న అనుబంధం ఎంతో స్ఫూర్తినిస్తుంది. అందుక‌నే నా యావ‌దాస్తిని అత‌డికి రాసిస్తున్నాను. అత‌డికి నా ఆస్తి దక్కితే అది మంచికే ఉప‌యోగప‌డుతుంది.’ అని ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Team India Jersey : డ్రీమ్ 11 ఎగ్జిట్ త‌రువాత‌.. భార‌త జ‌ట్టు జ‌ర్సీ చూశారా..? ఫోటోలు వైర‌ల్‌

అయితే.. ప్ర‌స్తుతం ఈ వీలునామా న్యాయ‌స్థానం ప‌రిధిలో ఉంది. ఆ విల్లు పై వ్యాపార వేత్త బంధువులు అభ్యంత‌రం చెప్ప‌క‌పోతే అతి త్వ‌ర‌లోనే ఆ ఆస్తి నెయ్‌మార్‌ చెందుతుంది. కాగా.. ఈ విల్లు పై నెయ్‌మ‌ర్ టీమ్ స్పందించింది. దీనిపై త‌మ‌కు ఎలాంటి అధికారక‌ స‌మాచారం అంద‌లేదంది.