Viral video: 13ఏళ్ల క్రితం తన జుట్టును తాకిన యువకుడితో మాట్లాడిన ఒబామా.. వైరల్ అవుతున్న వీడియో..

అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒరాక్ ఒబామా ఆసక్తికర వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియోలో 13ఏళ్ల క్రితం వైట్ హౌస్ లో ఓ చిన్నారి తన తల జుట్టును తాకిన ఫొటోను సైతం ఉంచాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒబామా తన ట్విటర్ ఖాతాలో ఆ వీడియో పోస్టు చేసిన కొద్దిగంటల సమయంలోనే 1.4 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు..

Viral video: అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒరాక్ ఒబామా ఆసక్తికర వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియోలో 13ఏళ్ల క్రితం వైట్ హౌస్ లో ఓ చిన్నారి తన తల జుట్టును తాకిన ఫొటోను సైతం ఉంచాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒబామా తన ట్విటర్ ఖాతాలో ఆ వీడియో పోస్టు చేసిన కొద్దిగంటల సమయంలోనే 1.4 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. అంతేకాదు.. నెటిజన్లు అమెరికా మాజీ ప్రెసిడెంట్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఒబామా ఆ వీడియోలో మాట్లాడింది.. 2009లో తన తలను తాకిన బాలుడితోనే.. వివరాల్లోకి వెళితే..

మే 2009లో అప్పటి ప్రెసిడెంట్ ఒరాక్ ఒబామా వైట్ హౌస్ లోకి ప్రవేశించిన కొన్ని నెలల తర్వాత ఐదేళ్ల జాకబ్ ఫిలడెల్ఫియా ఓవల్ కార్యాలయంలోకి అడుగుపెట్టాడు. అతను అమెరికాకు చెందిన నల్లజాతియుడు. అయితే జాకబ్ తన తండ్రి, అప్పటి జాతీయ భద్రతా మండలి సిబ్బంది కార్ల్‌టన్ ఫిలడెల్ఫియా, అతని తల్లి రోసేన్, అతని అన్న ఐజాక్‌తో కలిసి 2009 సంవత్సరంలో ఒబామాను కలిసిశారు. ఒబామాతో మాట్లాడుతున్న క్రమంలో.. జాకబ్ ఓ ప్రశ్న వేశాడు. నా జుట్టు మీలాగే ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను.. అని నెమ్మదిగా అడిగాడు.. ఒబామాకు ఆ బాలుడు చెప్పేది అర్థంకాక గట్టిగా చెప్పాలని అన్నాడు. దీంతో నా జట్టు మీలాగే ఉందోలేదో తెలుసుకోవాలనుకుంటున్నాను.. ఓసారి తాకవచ్చా.. అంటూ జాకబ్ అడిగాడు. దీంతో ఒబామా కిందకు ఒంగి తన తలను అందించాడు. దీంతో జాకబ్ ఒబామా తల వెంట్రుకలను తాకాడు. ఈ ఫోటోను ఒమాబా పెద్ద ఫ్రేమగా మార్చుకొని తన కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవటం గమనార్హం. అయితే ఈ చిత్రనికి “హెయిర్ లైక్ మైన్” అని పేరు పెట్టాడు ఒబామా.

Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. వరుడు బంధువులు ఏం చేశారంటే..

తాజాగా 2009(13ఏళ్ల క్రితం)లో వైట్ హౌజ్ లో తన తల జుట్టును తాకిన జాకబ్ తో ఒబామా జామ్ కాల్ ద్వారా మాట్లాడాడు. జాకబ్ శుక్రవారం కంపాలా శివార్లలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఉగాండా నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు జాకబ్ కు 18ఏళ్లు. జాకబ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని తెలుసుకున్న ఒబామా జూమ్ ద్వారా జాకబ్ తో మాట్లాడారు. వీరి సంభాషణలో ప్రముఖంగా 13ఏళ్ల నాటి ఫొటోపైనే చర్చ జరిగింది. నేను మొదటిసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడం ప్రారంభించినప్పుడు నేను కలిగి ఉన్న ఆశలలో ఈ చిత్రం ఒకటిగా ఉందని నేను భావిస్తున్నాను అంటూ మాజీ అధ్యక్షుడు పేర్కొన్నాడు. ఐదు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో తన చిన్నతనంలో ఒబామాను కలవడం నా జీవితంలో చాలా పెద్ద హైలైట్ అని జాకబ్ చెప్పాడు. మెంఫిస్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అధ్యయనం చేయాలనే తన ప్రణాళికల గురించి అతను మాజీ అధ్యక్షుడికి తెలియజేశాడు. తన చిన్నతనంలో ఒబామాను వైట్ హౌస్ లో కలిసి ప్రేరణ పొందినట్లు పేర్కొన్నాడు. ఐకానిక్ మూమెంట్ తనను ఎలా ప్రభావితం చేసిందో కూడా జాకబ్ చెప్పాడు. ప్రభుత్వంలో ప్రాతినిధ్యాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉందని, ఎందుకంటే నేను మరొక నల్ల జాతీయుడు అగ్రస్థానంలో ఉండటం, ఆ శిఖరాగ్రంలో ఉండటం, అప్పుడు నేను ఆ మార్గాన్ని అనుసరించాలనుకున్నానని జాకబ్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు