America : తాగొచ్చిన వరుడు..మాజీ ప్రియుడితో వధువు పరార్

మేరీల్యాండ్ కు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. కానీ..పెళ్లికి బంధువులు ఎవరూ రాలేదు. దీంతో మాజీ ప్రియుడిని ఆహ్వానించింది.

Drunk Groom : పెళ్లి…చేసుకుంటున్నామనే ఆనందంలో…కొంతమంది ఏం చేస్తారో వారికే తెలియదు. ఆనందంగా జరుపుకోవాల్సిన పెళ్లిళ్లు రద్దవుతుంటాయ. చివరి నిమిషంలో వరుడు వింత వింత కోర్కెలను వెల్లడించడం, వరుడి ప్రవర్తన, తీరు నచ్చక పోవడంతో కొంతమంది వధువులు పెళ్లి వద్దని చెప్పేస్తుంటారు. తాజాగా.. కాసేపట్లో పెళ్లి అని తెలిసినా..ఓ వరుడు ఫుల్ గా మందు కొట్టి వచ్చాడు. అటూ ఇటూ తూలుతుండడం, విచిత్రంగా ప్రవర్తిస్తుండడంపై వధువుకు ఫుల్ కోపం వచ్చింది. అతనితో పెళ్లి వద్దని చెప్పి…మాజీ ప్రియుడితో పరార్ అయ్యింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అయితే..ఈ ఘటన జరిగి ఏడాదవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More : CM Jagan : ఇళ్ల పట్టాల పంపిణీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు 

మేరీల్యాండ్ కు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. కానీ..పెళ్లికి బంధువులు ఎవరూ రాలేదు. దీంతో మాజీ ప్రియుడిని ఆహ్వానించింది. పెళ్లి మంటపానికి వరుడు మందు తాగి వచ్చాడు. అటూ ఇటూ తూలుతున్నాడు. వధువు గమనించింది. వరుడు ముఖంలోకి చూడలేకపోతున్నాడు. ఉంగరాలను కూడా కిందపడేశాడు..అంటూ తన బాధను మాజీ ప్రియుడితో చెప్పింది.

Read More : London: భారత్ హెచ్చరిక.. దిగొచ్చిన బ్రిటన్.. UK కొత్త టీకా విధానం!

ఆమె బాధను అర్థం చేసుకున్న అతను..అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని..అంతేగాకుండా..ఈ విషయంలో పలువరు చెప్పిన మాటలను వినిపించుకోలేదని యువతితో చెప్పాడు. వధువుపై ఉన్న ఫీలింగ్స్ ను చెప్పి తనతో వచ్చేందుకు సిద్ధమేనా అని మనస్సులో ఉన్న మాటను చెప్పేశాడు. వధువు ఏ మాత్రం ఆలోచించలేదు. తన బాయ్ ఫ్రెండ్ తో పరారైంది. కారు పార్కింగ్ వద్దకు వెళుతూ..ఒకరినొకరు కిస్ చేసుకుంటూ…వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు