Britain aid to Ukraine: యుక్రెయిన్ కు రూ.12 వేల కోట్లు ఆర్ధిక సహాయం ప్రకటించిన బ్రిటన్

యుక్రెయిన్ కు మరింత సైనిక సహకారం అందించేందుకు 1.3 బిలియన్ పౌండ్లు(దాదాపు రూ.12,344 కోట్లు) ఆర్ధిక సహాయం అందించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది

Britain aid to Ukraine: రష్యాపై యుద్ధం నేపథ్యంలో యుక్రెయిన్ కు మరింత సైనిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పశ్చిమదేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో యుక్రెయిన్ కు 1.3 బిలియన్ పౌండ్లు(దాదాపు రూ.12,344 కోట్లు) ఆర్ధిక సహాయం అందించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఆదివారం యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ఏడుగురు యురోపియన్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో బ్రిటన్ ఆర్ధిక సహాయం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా యుక్రెయిన్ లో రష్యా విధ్వంసం ప్రారంభమైన నాటి నుంచి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ యుక్రెయిన్ కు బాసటగా నిలుస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు యాంటీ ట్యాంక్ క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలు మరియు ఇతర ఆయుధాలను పంపింది.

Also read:Russia Ukraine War: శ‌త్రుదేశాల‌కు వ‌ణుకు పుట్టించే సందేశం

ప్రస్తుతం ప్రకటించిన ఆర్ధిక సహాయం..గతంలో ప్రకటించిన దానికంటే రెండింతలు ఎక్కువ కాగా, ఇప్పటివరకు ఇరాక్, అఫ్గానిస్తాన్ సంక్షోభాల సమయంలో కంటే ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ కావడం గమనార్హం. “పుతిన్ యొక్క క్రూరమైన దాడి యుక్రెయిన్‌లో చెప్పలేని విధ్వంసం కలిగించడమే కాదు, ఇది ఐరోపా అంతటా శాంతి మరియు భద్రతకు ముప్పు కలిగిస్తోంది” అని బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన ఆర్ధిక సహాయంతో యుక్రెయిన్ లో ప్రజలకు ఆహార వైద్య సహాయం అందజేయడంతో పాటు అత్యవసర భద్రత నిమిత్తం వినియోగించనున్నారు.

Also read:Maharashtra : ప్రాణాలను పణంగా పెట్టి ఆగిపోయిన రైలును తిరిగి నడిపిన లోకో పైలట్

ఐరోపాలో రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సూచకంగా మే 9న రష్యా తన “విక్టరీ డే” వేడుకలు నిర్వహించనుండగా అందుకు ఒక రోజు ముందు ఆదివారం నాడు బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు అమెరికా దేశాల జీ -7 నాయకులు జెలెన్స్కీతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. యుక్రెయిన్‌ కు ప్రకటించిన అదనపు ఆర్ధిక సహాయం..అత్యవసర పరిస్థితుల కోసం బ్రిటన్ ప్రభుత్వం ఉపయోగించే రిజర్వ్ నిధుల నుండి అందిస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. మరోవైపు యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన యుక్రెయిన్లకు బ్రిటన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తూ అత్యవసర వీసాలు అందిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు