G20 logo Row: జీ20 దేశాల ఢిల్లీ సదస్సు లోగోలో ‘కమలం’ గుర్తుపై వివాదం.. మమత ఆగ్రహం.. కేంద్ర మంత్రి స్పందన

‘‘నేను లోగోలో కమలం గుర్తును చూశాను. ఇది దేశానికి సంబంధించిన అంశం. అందుకే నేను దీనిపై ఇతర విషయాలు మాట్లాడడం లేదు. ఈ అంశంపై బయట మాట్లాడితే దేశానికి మంచిది కాదు’’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ కూడా జీ20 దేశాల ఢిల్లీ సదస్సు లోగోలోపై అభ్యంతరాలు తెలిపింది. భారతీయ జనతా పార్టీని ప్రచారం చేసుకునేందుకు ఆ లోగోలో కమలం గుర్తును ముద్రించారని మండిపడింది. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. భారతదేశ సాంస్కృతిక గుర్తింపులో పువ్వు ఒక భాగమని చెప్పుకొచ్చారు.

G20 logo Row: జీ20 దేశాల ఢిల్లీ సదస్సు లోగోలో కమలం గుర్తు ఉండడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం పాటు జీ20 దేశాల కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సెప్టెంబరు 9,10వ తేదీల్లో ఢిల్లీలో శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఆ తర్వాత కొన్ని నెలలకే భారత్ లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.

మోదీ జీ20 దేశాల ఢిల్లీ సదస్సు లోగోతో పాటు వెబ్ సైట్ ను ఇప్పటికే ఆవిష్కరించారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం. జీ20 దేశాల ఢిల్లీ సదస్సు లోగోలోనూ కమలం గుర్తు ఉంది. దీనిపై మమతా బెనర్జీ ఇవాళ స్పందించారు. ఆ లోగోలో కమలం గుర్తుకి బదులు ఏదైనా జాతీయ చిహ్నాన్ని వాడి ఉంటే బాగుండేదని చెప్పారు. లోగోను కూడా వివాదాస్పదంగా మార్చారని మండిపడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆమె సూచించారు.

Deer Escapes Video: తెలివిగా బారియర్ గేటు దాటుకుని బయటకు జింక

‘‘నేను లోగోలో కమలం గుర్తును చూశాను. ఇది దేశానికి సంబంధించిన అంశం. అందుకే నేను దీనిపై ఇతర విషయాలు మాట్లాడడం లేదు. ఈ అంశంపై బయట మాట్లాడితే దేశానికి మంచిది కాదు’’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ కూడా జీ20 దేశాల ఢిల్లీ సదస్సు లోగోలోపై అభ్యంతరాలు తెలిపింది. భారతీయ జనతా పార్టీని ప్రచారం చేసుకునేందుకు ఆ లోగోలో కమలం గుర్తును ముద్రించారని మండిపడింది. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. భారతదేశ సాంస్కృతిక గుర్తింపులో పువ్వు ఒక భాగమని చెప్పుకొచ్చారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు