Chandrayaan-3 vs Luna-25 : జాబిల్లిపైకి రష్యా ప్రయోగం వల్ల చంద్రయాన్‌-3కి ఇబ్బందులుంటాయా? శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..?

ఇండియా, రష్యా ప్రయోగించిన రాకెట్లు చంద్రుడిపై దక్షిణ ధ్రువంలోనే ల్యాండ్ కానున్నాయి. అయితే, రష్యా ప్రయోగించిన లూనా-2 ముందుగా చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని..

Russia Luna -25

Russia Luna-25 : భారత్ తర్వాత ఇప్పుడు రష్యా జాబిల్లిపైకి లూనా-25 రాకెట్‌ను ప్రయోగించింది. 1976 తరువాత రాష్యా చేపట్టిన తొలి లూనార్ ల్యాండర్ ప్రయోగం ఇదే. రాజధాని మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలో వాస్తోక్నీ కాస్మోడ్రోమ్ ప్రాంతం నుంచి శుక్రవారం తెల్లవారు జామున 2.10 గంటలకు లూనా-25 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. రష్యా ప్రయోగించిన లూనా-25 రాకెట్ కేవలం ఐదు రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఆ తరువాత చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మరో మూడు లేదా ఏడు రోజుల్లో ల్యాండర్‌ను దిగేలా రష్యా ఈ ప్రయోగం చేపట్టింది.

Luna 25 Mission: 47 ఏళ్ల తర్వాత చంద్రుడి మీదకి లూనా 25 పంపిన రష్యా.. చంద్రయాన్-3 కంటే ముందే చంద్రుడి మీద దిగుతుందట

ఇదిలాఉంటే.. చందమామపై చెరగని ముద్ర వేయడానికి, అంతరిక్ష ప్రయోగ రంగంలో భారత కీర్తి ప్రతిష్టల్ని మరింత ఇనుమడింప జేసేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. గత నెల 14న శ్రీహరికోట నుంచి శాస్త్రవేత్తలు నింగిలోకి చంద్రయాన్-3ని ప్రయోగించారు. విజయవంతంగా చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు ఈ ప్రయోగం చేపట్టి ఇరవైరోజులకుపైగా అవుతుంది. తాజాగా చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరగా వెళ్లినట్లు ఇస్రో తెలిపింది. ఆగస్టు 16న చంద్రుడికి 100 కిలో మీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి ఈ అంతరిక్ష నౌక చేరనుంది. ఆ మర్నాడే ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోతుంది. దీనిలో ల్యాడర్ (విక్రమ్), రోవర్ (ప్రగ్యాన్) ఉంటాయి. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47గంటలకు ల్యాండర్ – రోవర్ చంద్రుడిపై ల్యాండింగ్ అవుతుంది.

ISRO Chandrayan-3 : జూలై నాటికి చంద్రునిపైకి చంద్రయాన్-3.. సురక్షిత ల్యాండింగ్‌పై దృష్టిపెట్టామన్న ఇస్రో చైర్మన్

చంద్రయాన్ -3 చంద్రుడిపై ల్యాండ్ అయ్యే సమయం కంటే ముందుగానే అంటే ఈనెల 23వ తేదీకంటే ముందుగానే తాజాగా రష్యా ప్రయోగించిన లూనా-25  చంద్రుడిపైకి అడుగుపెట్టనుంది. ఈ రెండు రాకెట్లు చంద్రుడిపై దక్షిణ ధ్రువంలోనే అడుగు పెట్టనున్నాయి. ఈ క్రమంలో లూనా-25 వల్ల చంద్రయాన్ -3కి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే సందేహాలు ప్రతిఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. దీనిపై రష్యా స్పష్టత ఇచ్చింది. ఈ రెండు అంతరిక్ష సంస్థలు ల్యాండింగ్ చేయాలనుకున్న ప్రాంతాలు వేరువేరని పేర్కొంది. అందువల్ల అవి ఢీకొనే ప్రమాదం లేదని, దీంతో లూనా-25 వల్ల చంద్రయాన్-3కి ఎలాంటి ఇబ్బంది ఉండదని రష్యా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Virat Kohli : ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదించే ఇండియన్ విరాట్ కోహ్లీ.. ఒక్క పోస్ట్‌కు ఎంతో తెలుసా?

ఇండియా, రష్యా ప్రయోగించిన రాకెట్లు చంద్రుడిపై దక్షిణ ధ్రువంలోనే ల్యాండ్ కానున్నాయి. అయితే, రష్యా ప్రయోగించిన లూనా-2 ముందుగా చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే, జాబిల్లి దక్షిణ ద్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. అయితే, భారత్ ప్రయోగించిన చంద్రయాన్ -3 పంపే ల్యాండర్ చంద్రుడిపై 14రోజులపాటు పరిశోధనలు చేయనుంది. రష్యా పంపే లూనా-25 ఏడాదిపాటు చంద్రుడి ఉపరితలంపై పనిచేయనుంది.

ట్రెండింగ్ వార్తలు