China: 78 ఏళ్ల అమెరికా పౌరుడికి చైనా యావజ్జీవ కారాగార శిక్ష.. ఎందుకంటే?

చైనాలో గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరపడం సాధారణమే.

US citizen: చైనాలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడంటూ ఆ దేశ కోర్టు 78 ఏళ్ల అమెరికా పౌరుడికి ఇవాళ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జాన్ షింగ్-వాన్ లెంగ్ అనే వ్యక్తికి హాంకాంగ్ లో శాశ్వత నివాస హక్కు ఉంది. ఆయన హాంకాంగ్ (Hong Kong)లో ఉంటూ అమెరికా (US)కు గూఢచారిగా వ్యవహరిస్తున్నారని చైనా ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జాన్ షింగ్-వాన్ లెంగ్ కి శిక్ష విధించిన సుజౌలోని కోర్టు ఈ కేసుకు సంబంధించిన ఇతర వివరాలు ఇవ్వలేదు. జాన్ షింగ్-వాన్ లెంగ్ ను రెండేళ్ల క్రితం చైనా లోకల్ బ్యూరో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అరెస్టు చేసింది. అతడిని కోర్టు దోషిగా తేల్చిందని, యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని చైనా మీడియా వివరించింది.

జాన్ షింగ్-వాన్ లెంగ్ ను చైనా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏ ప్రాంతంలో అరెస్టు చేసిందనే విషయంపై కూడా స్పష్టత లేదు. తమ పౌరుడు షింగ్-వాన్ లెంగ్ కు శిక్ష పడినట్లు తమకు తెలిసిందని చైనాలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి కూడా చెప్పారు.

విదేశాల్లోని తమ పౌరుల రక్షణ, భద్రత కన్నా ముఖ్యమైన అంశంగా అమెరికా విదేశాంగ శాఖ దేన్నీ పరిగణించబోదని స్పష్టం చేశారు. చైనాలో గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరపడం సాధారణమే. జాతీయ భద్రత విషయంలో కొత్త కొత్త చట్టాలను రూపొందించుకుంటుంది చైనా.

Mexico Road Accident : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ – వ్యాన్ ఢీ, 26 మంది మృతి

ట్రెండింగ్ వార్తలు