Shanghai Lockdown : షాంఘైలో మళ్లీ లాక్‌డౌన్… ఊరు ఖాళీ చేస్తున్న ప్రజలు

చైనాలోని షాంఘై నగరంలో మళ్లీ కోవిడ్   కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ లాక్ డౌన్ విధించింది.  దీంతో ప్రజలు షాంఘైను   వదిలి పెట్టి వేరే ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.

Shanghai Lockdown :  చైనాలోని షాంఘై నగరంలో మళ్లీ కోవిడ్   కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ లాక్ డౌన్ విధించింది.  దీంతో ప్రజలు షాంఘైను   వదిలి పెట్టి వేరే ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.  లాక్ డౌన్ ఉన్నా సరే ఎలాగోలా ఊరు వదిలి పెట్టి వెళ్లేందుకు ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు.  సోషల్ మీడియాలో ఐడియాలు షేర్ చేసుకుంటున్నారు.

షాంఘై చైనాలో అత్యంత కీలకమైన నగరం. అక్కడ ఎన్నో ఐటీ కంపెనీలు ఉన్నాయి. విదేశీయులు కూడా ఉన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలు సిటీ విడిచిపెట్టి  వెళ్లటానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.   ప్రతి నెలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ కు  30 నుంచి 40 ఆర్డర్లు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం డిమాండ్ పెరిగి పోయి ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.

ప్రజలు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. విదేశీయులకు తినటానికి ఆహారం దొరకటం కూడా కష్టం అవుతోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందును ఒకరికి   ఒకరు  సహాయం చేసుకోటానికి కూడా ఎవరూ ముందుకు రావటంలేదు.   కొందరు ప్రజలు ఐసోలేషన్ లో ఉండిపోతున్నారు.  కోవిడ్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవటంలేదని విమర్శలు ఎదుర్కోంటోంది.
Also Read : Bird flu : అమెరికాలో బయటపడ్డ తొలి బర్డ్‌ఫ్లూ కేసు
క్యాబ్ డ్రైవర్లు చార్జీలు పెంచేశారు. 30 డాలర్లు ఖర్చయ్యే విమానాశ్రయానికి 500 డాలర్లు తీసుకుంటున్నారు. కోవిడ్   కేసులు పెరుగుతున్నందువల్ల ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు మూసి వేశారు. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.  షాంఘైలో గత 11 రోజుల్లో కోవిడ్ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.  ఏప్రిల్ 17 నుంచి ఇప్పటి వరకు 285 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. కోవిడ్ వచ్చిన వారిలో లక్షణాలు కనపడకపోవటం అంతర్జాతీయ పరిశీలకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు