హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం.. ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని ప్రకటించిన ఇరాన్

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైస్ దుర్మరణం.. ఎవరూ ప్రాణాలతో మిగలేదని ప్రకటించిన ఇరాన్

Iran President Helicopter Incident : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందాడు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయిన విషయం విధితమే. ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తుంది. అయితే, తాజాగా హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (IRCS) ప్రకటించింది. కూలిన విమానం ప్రదేశాన్ని చూపుతున్న వీడియోను ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ తన ఎక్స్ (ట్విటర్ ) ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో కూలిపోయిన హెలికాప్టర్ ముక్కలుగా పడిఉంది. హెలికాప్టర్ చుట్టుపక్కల ప్రాంతంలో మంటలు వ్యాపించిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే, హెలికాప్టర్ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో మిగలలేదని ఇరాన్ ప్రకటించింది. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీరబ్దోల్లహియస్, తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహ్ మతీ తదితరులుకూడా మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది.

Also Read : Iran President Raisi : ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ ప్రయాణించే హెలికాప్టర్‌కు ప్రమాదం..!

ఇరాన్ – అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం ఉదయం అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి డ్యామ్‌ను ప్రారంభించారు. ఆరాస్ నదిపై రెండు దేశాలు కలిసి మూడు డ్యామ్‌లను నిర్మించాయి. రెండు దేశాల మధ్య చిన్నచిన్న సమస్యలు ఉన్నా.. రైసీ ఆ దేశంలో పర్యటించారు. డ్యాంల ప్రారంభం తరువాత విదేశాంగ మంత్రి, తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్సు ఇమామ్ లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నాడు. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ కూలిపోయిన ప్రాంతం ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్ కు వాయవ్యాన దాదాపు 600 కిలో మీటర్ల దూరంలో ఉంది. అయితే, ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెంట మరో రెండు హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నాయి.

Also Read : UK PM Rishi Sunak : కింగ్ చార్లెస్ కన్నా సంపాదనలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ రికార్డు

అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిన సమాచారం అందుకున్న త్రివిద దళాలు సహాయక చర్యలు వేగంగా చేపట్టాయి. అయితే, ప్రతికూల వాతావరణం నేపథ్యంలో సోమవారం హెలికాప్టర్ కూలిన ప్రదేశాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ గుర్తించింది. హెలికాప్టర్ పూర్తిగా ద్వంసంమై, శకలాలను గుర్తించారు. దీంతో ఇరాన్ అధ్యక్షుడుతో సహా ఆయన వెంట హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న వారంతా మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.

 

ట్రెండింగ్ వార్తలు