War: చరిత్రలో ఇప్పటివరకు యుద్ధం చేయని ఈ ఐదు దేశాల గురించి మీకు తెలుసా?
ఈ ఐదు దేశాలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా యుద్ధం(War)లో పాల్గొనలేదు.
Do you know about these top 5 countries that have never fought a war
War: యుద్ధం అనేది ఏ దేశ ఎదుగుదలకు కూడా మంచిది కాదు. కానీ, ఈ మధ్య కాలంలో వివిధ దేశాల మధ్య చిన్న చిన్న కారణాల వల్ల కూడా భీకరమైన యుద్దాలు జరుగుతున్నాయి. ఆమధ్య రష్యా, ఉక్రేయిని మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తరువాత ఇండియా- పాకిస్థాన్ మధ్య కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.ఇప్పుడు అమెరికా-ఇజ్రాయిల్- ఇరాక్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో సామాన్యులు సైతం బలవుతున్నారు. చరిత్రలో చాలా దేశాలు చాలాసార్లు యుద్ధాలలో పాల్గొన్నాయి. కానీ, ఈ ఐదు దేశాలు మాత్రం ఇప్పటివరకు ఒక్క యుద్ధంలో కూడా పాల్గొనలేదు. ఆయా దేశాలు శాంతిని ప్రకటిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. మరి ఆ దేశాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
యుద్ధం చేయని దేశాలు:
మొదటిది శాన్ మారినో.. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రిపబ్లిక్ దేశం. ఒక్కసారి కూడా యుద్ధం చేయని దేశాల జాబితాలో ఇది అగ్రస్థానంలో ఉంది. 4వ శతాబ్దంలో స్థాపించబడిన ఈ దేశ విస్తీర్ణం 61.2 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడి జనాభా 40,000 కంటే తక్కువే. శతాబ్దాలుగా ఈ దేశం తటస్థ వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది.
రెండవది వాటికన్ సీటీ.. ఈ దేశాన్ని శాంతి, దైవానికి ప్రతీకగా చెప్తారు. అందుకే, ఈ దేశం యుద్దానికి(War), హింసకు దూరంగా ఉంటూ వస్తోంది. రోమ్ నగరంలో ఈ సిటీ ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. రోమన్ కాథలిక్ చర్చికి కేంద్రంగా ఉన్న ఈ నగరానికి అక్కడి పోప్ దిశానిర్దేశం చేస్తారు. ఆయన శాంతిని ప్రచారం చేయడం వల్ల వాటికన్ సిటీ చరిత్రలో ఈనాడు యుద్ధం వైపు అడుగులు వేయకుండా ప్రశాంగా ఉంది.
Chiranjeevi: కొడుకు డాన్స్ చూసి మురిసిపోతున్న చిరు.. రయ్ రయ్ రారా సాంగ్ పై మెగా ప్రశంసలు
మూడవది కోస్టా రికా.. 1949లో ఈ దేశంలో అంతర్యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తరువాత ఈ దేశం తమ సైన్యాన్ని రద్దు చేసింది. అప్పటినుంచి ఈ దేశం తన వనరులను విద్య. ఆరోగ్యం పైన ఎక్కువగా ఖర్చు చేసింది. అలా తమ దేశంలో శాంతిని నెలకొల్పింది ఈ దేశం. అందుకే. ఇప్పటివరకు ఈ దేశం నేరుగా యుద్ధంలో పాల్గొనలేదు.
నాలుగవది స్విట్జర్లాండ్.. ఈ దేశం కూడా ఇప్పటివరకు ఒక్క యుద్ధంలో కూడా నేరుగా పాల్గొనలేదు. కారణం ఏంటంటే, 1815లో పారిస్ ఒప్పందంలో భాగంగా యుద్ధంలో ఎప్పటికీ పాల్గొనకూడదని కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం స్విట్జర్లాండ్ యుద్ధాలను హింసకు దూరంగా ఉంటూ వస్తోంది. కానీ, ఈ దేశం తమ రక్షణ కోసం పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేసుకుంది.
ఐదవది ఐస్లాండ్.. ఈదేశం NATO వంటి అంతర్జాతీయ సంస్థలలో చురుకైన సభ్యత్వాన్ని కలిగి ఉంది. అందుకే, ఈ దేశం తటస్థమైన వైఖరిని ఎంచుకోగలిగింది. ఈ దేశం యొక్క ప్రత్యేకమైన నిర్మాణం, ఒంటరిగా ఉండటం అనేది యుద్ధాలకు దూరంగా ఉండేలా చేసింది. అందుకే, ఈ దేశం ఇప్పటివరకు ఒక్క యుధంలో కూడా పాల్గొనలేదు.
ఇలా ఈ దేశాలు తటస్థమైన వైఖరిని ఏర్పరుచుకొని యుద్ధాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తున్నాయి.
