Iran Israel War: ఇజ్రాయెల్ ప్రధాని ఆఫీస్ పై మిస్సైల్స్ దాడి..! ఇరాన్ సంచలన ప్రకటన
ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయాన్ని టార్గెట్ చేశామని, నెతన్యాహు ఆఫీస్ పై మిస్సైల్స్ ప్రయోగించినట్లు ప్రకటించింది.
Representative Image (Image Credit To Original Source)
Iran Israel War: తమ నాయకుడిని కోల్పోయిన ఇరాన్.. ప్రతీకారంతో రగిలిపోతోంది. అంతకంత పగ తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంతంతోనే తమ నాయకుడి హత్యకు సరైన ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుందనే ఆలోచనతో దాడులు చేస్తోంది. ఇదే సమయంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయాన్ని టార్గెట్ చేశామని, నెతన్యాహు ఆఫీస్ పై మిస్సైల్స్ ప్రయోగించినట్లు ప్రకటించింది. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు అమెరికాను, ఇటు ఇజ్రాయెల్ ను టార్గెట్ చేసింది.
మొత్తంగా తమ సుప్రీం లీడర్ లేకుండానే యుద్ధంలో విరుచుకుపడుతోంది. తమ సుప్రీం లీడర్ ను చంపిన రాజ్యాలకు తగిన బుద్ధి చెబుతామంటూ మిస్సైల్స్ ప్రయోగిస్తోంది. ప్రతీకారంతో యూఎస్ బేస్ క్యాంప్ లపై క్రూయిజ్ మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ జ్వాలలు వ్యాపించాయి. ఎప్పుడు ఎక్కడ బాంబు పడుతుందో తెలియని స్థితిలో గల్ఫ్ దేశాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఇరాన్ మాత్రం రివెంజ్ తీర్చుకోవాలనే పంతంతో దాడులు చేస్తూనే ఉంది.
Also Read: న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి? ఇరాన్ రాయబారి సంచలన ఆరోపణలు
