Iran President Raisi : ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణించే హెలికాప్టర్‌కు ప్రమాదం..!
Iran President Raisi : తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించింది.

Iran President Raisi Helicopter Incident
Iran President Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నేలను బలంగా తాకింది. ఈ ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న అధ్యక్షుడు జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. వాతావరణంలోని మార్పులే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ గురైన విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది.
ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. సంఘటన జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ రాజధానికి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో దేశానికి సరిహద్దుల్లో తూర్పున ఉన్న అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఇరాన్ ప్రభుత్వం మీడియా సంస్థలు తెలిపాయి హెలికాప్టర్‌లో అజర్ బైజాన్ తూర్పు గవర్నర్ సహా విదేశాంగ మంత్రి హోసింగ్ అమీర్ ఉన్నారని తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది అని చెబుతున్నారు.
అధ్యక్షుడు రైసీ ప్రయాణించే హెలికాప్టర్‌తో పాటు కాన్వాయ్‌లోని మరో రెండు హెలికాప్టర్లు కూడా ఉన్నాయని పేర్కొంది. సెమీ-అధికారిక ఫార్స్ వార్తా సంస్థ నివేదికలను అనుసరించి రైసీ కోసం ప్రార్థన చేయాలని ఇరానియన్లకు పిలుపునిచ్చింది. ఇంటీరియర్ మినిస్టర్ అహ్మద్ వహిది స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా, 63 ఏళ్ల రైసీ 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నైతిక చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించారు.