US – China warnings: ఆసియాలోనూ యుద్ధ మేఘాలు?: అమెరికాకు చైనా వార్నింగ్

తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతునిచ్చే ప్రయత్నాలకు "భారీ మూల్యం" చెల్లించవలసి ఉంటుందని చైనా మంగళవారం అమెరికాను హెచ్చరించింది.

US – China warnings: రష్యా యుక్రెయిన్ యుద్ధంతో పశ్చిమ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరోవైపు ఆసియాలోనూ చైనా రంకెలు గుబులు పుట్టిస్తున్నాయి. తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతునిచ్చే ప్రయత్నాలకు “భారీ మూల్యం” చెల్లించవలసి ఉంటుందని చైనా మంగళవారం అమెరికాను హెచ్చరించింది. అమెరికా రక్షణశాఖకు చెందిన మాజీ అధికారుల ప్రతినిధి బృందం ఒకటి ఇటీవల తైపీలో దిగింది. తైవాన్ స్వతంత్ర దేశంగా అమెరికా మద్దతు ఇవ్వడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ తమ భూభాగంలోనిధే అంటూ చైనా వాదిస్తుండగా.. తైవాన్ మాత్రం తాము ప్రజాస్వామ్య దేశమనే చెబుతుంది. ఈక్రమంలో చైనా దూకుడుకు కళ్లెం వేసి.. తైవాన్ కు మద్దతునిచ్చేలా అమెరికా చేస్తున్న చర్యలు చైనాకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

Also read: Russia Ukraine Talks : యుద్ధం ఆగేనా? ర‌ష్యా, యుక్రెయిన్ మ‌ధ్య రేపు రెండో విడ‌త చ‌ర్చ‌లు

తైవాన్ ను తమ భూభాగంలో కలుపుకోవడమే లక్ష్యంగా ఇటీవలి కాలంలో చైనా తన వైమానిక దళాన్ని తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి పంపే ఏర్పాట్లలో నిమగ్నమైంది. దానితో పాటుగా నేవీని కూడా బలోపేతం చేసిన చైనా.. తైవాన్ ను తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని భావిస్తుంది. ఇక ఇటీవల యూరోప్ లో జరిగిన జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. యుక్రెయిన్ ను ఆక్రమించుకోవాలన్న రష్యా వలె.. చైనా కూడా తైవాన్ను బలవంతంగా కలుపుకుంటామని బెదిరించసాగింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. తైవాన్ లో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేదిశగా తాము సహకరిస్తామని అమెరికా తెలిపింది.

Also read: Russia War : అప్పటివరకు తగ్గేదేలే.. యుద్ధంపై రష్యా కీలక ప్రకటన

ఈక్రమంలో తైపీలో అమెరికా రక్షణ ప్రతినిధుల బృందం పర్యటించడంపై చైనా విదేశాంగశాఖ స్పందించింది. జాతీయ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని చైనా ప్రజలు దృఢంగా నిశ్చయించుకున్నారని చైనా విదేశాంగశాఖ పేర్కొంది. “తైవాన్‌కు మద్దతు తెలిపేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నం ఎవరిని పంపినా ఫలించదు. ఒకే చైనా సూత్రానికి కట్టుబడి ఉండాలని చైనా అమెరికాను కోరుతోంది” అంటూ అమెరికాను హెచ్చరించింది చైనా. తైవాన్ ను కాపాడాలన్న ఆలోచనతో అమెరికా తమతో విభేదిస్తే.. తీవ్రపరిణామాలు ఉంటాయని చైనా హెచ్చరించింది.

Also read: Ukraine Soldiers: రష్యా భీకర దాడులు.. 70మంది యుక్రెయిన్ సైనికులు మృతి

ట్రెండింగ్ వార్తలు