Russia War : అప్పటివరకు తగ్గేదేలే.. యుద్ధంపై రష్యా కీలక ప్రకటన

ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా, కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. రష్యా(Russia War) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ పై యుద్ధం ఆపడం లేదు.

Russia War : ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా, కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ పై యుద్ధం(Russia War) ఆపడం లేదు. రోజురోజుకి దాడులను మరింత ఉధృతం చేస్తోంది. యుక్రెయిన్ పై యుద్ధం గురించి తాజాగా రష్యా కీలక ప్రకటన చేసింది. ల‌క్ష్యం చేరేదాకా వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని ర‌ష్యా సంచ‌ల‌న ప్ర‌కట‌న చేసింది. ర‌ష్యా నిర్దేశించుకున్న‌ల‌క్ష్యం నెర‌వేరే దాకా యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేదే లేద‌ని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. తాము నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించే వరకు ర‌ష్యా సాయుధ ద‌ళాలు ప్ర‌త్యేక సైనిక చ‌ర్య‌ను కొన‌సాగిస్తాయ‌ని ఆయ‌న చెప్పారు.

యుక్రెయిన్‌ను నిస్సైనికీక‌ర‌ణ చేయ‌డంతో పాటుగా యుక్రెయిన్ నుంచి నాజీ త‌త్వాన్ని పార‌దోల‌డ‌మే ర‌ష్యా ల‌క్ష్యాల‌ని కూడా సెర్గీ వెల్ల‌డించారు. ఉక్రెయిన్‌ను నిస్సైనికీక‌ర‌ణ చేసేందుకు తాము సైనిక చ‌ర్య‌కు పాల్ప‌డితే.. అందుకు ప్ర‌తిగా పాశ్చాత్య దేశాలు త‌మ‌పై ఆంక్ష‌లు విధిస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాశ్చాత్య దేశాల సైనిక ముప్పు నుంచి ర‌ష్యాను కాపాడుకోవ‌డం కూడా త‌మ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మ‌ని తెలిపారు. మొత్తంగా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు ఇచ్చినా.. ఉక్రెయిన్‌లో తాను అనుకున్న ప‌రిస్థితులు నెల‌కొనేదాకా యుద్దాన్ని ఆపేదేలేద‌ని ర‌ష్యా వైఖ‌రిని స్పష్టం చేశారు సెర్గీ.

Russia Ukraine War : నాడు జర్మనీ కోసం హిట్లర్… నేడు రష్యా కోసం పుతిన్

యుక్రెయిన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని చెబుతున్న రష్యా… ఆ దిశగా దాడులు ముమ్మరం చేసింది. గత కొన్నిరోజులతో పోల్చితే ఇవాళ భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. దాదాపు రష్యా తన సైన్యంలో సగం బలగాలను యుక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా తరలిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో యుక్రెయిన్ లోని ఇతర నగరాలను కూడా చేజిక్కించుకునేందుకు రష్యా బలగాలు భీకర దాడులు జరుపుతున్నాయి.

ఒకిట్రికా నగరం దగ్గర రష్యా బలగాలు జరిపిన ఓ రాకెట్ దాడిలో యుక్రెయిన్ కు చెందిన 70 మంది సైనికులు మృతి చెందారు. అంతేకాకుండా, పదుల సంఖ్యలో సాధారణ పౌరులు కూడా బలయ్యారని యుక్రెయిన్ వర్గాలు తెలిపాయి. తమకు ఆయుధాలు ఉంటే చాలని, రష్యాపై పోరాటం ఆపబోమని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మరోసారి స్పష్టం చేశారు.

Ukraine Russia War : యుక్రెయిన్‌పై వెనక్కి తగ్గని పుతిన్.. ఆ ధైర్యం ఇచ్చింది ఇతడేనట..!

భారీ ఆయుధ సంప‌త్తితో త‌మ దేశంపైకి రష్యా దండెత్తినా.. యుక్రెయిన్ సైనికులు వెనక్కి తగ్గడం లేదు. ప్రాణాల‌కు తెగించి మ‌రీ ర‌ష్యా సేనలను అడ్డుకుంటున్నారు. ర‌ష్యా తీరుపై ఆగ్ర‌హంతో ఊగిపోతున్న యుక్రెయిన్ పౌరులు కూడా ర‌ష్యా సైన్యానికి చుక్క‌లు చూపిస్తున్నారు.

మరోవైపు యుక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల్లో భార‌తీయ విద్యార్థి నవీన్ చ‌నిపోయాడు. కర్నాటకకు చెందిన నవీన్ యుక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌లో వైద్య విద్య అభ్య‌సిస్తున్నాడు. యుద్ధం మొద‌లైన నాటి నుంచి తోటి విద్యార్థుల‌తో క‌లిసి బంక‌ర్‌లో త‌ల‌దాచుకుంటున్న న‌వీన్.. మంగ‌ళ‌వారం(మార్చి 1) ఉద‌యం బంక‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అదే సమయంలో ర‌ష్యా చేసిన దాడుల్లో అత‌డు మ‌ర‌ణించాడు.

ట్రెండింగ్ వార్తలు