TTD : టీటీడీ నూతన ఈవోగా శ్యామలరావును నియమించిన ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రస్తుతం టీటీడీ ఇన్ ఛార్జి ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డి అక్కడినుంచి పూర్తిగా రిలీవ్ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే

Tirumala Latest News : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో)ను ఏపీ ప్రభుత్వం నియమించింది. టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శ్యామలరావు 1997 కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా ఉన్న శ్యామలరావు సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకోవడంతోపాటు, రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా పనిచేసి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు ఉండటంతో.. ఇలాంటి అధికారి టీటీడీ ఈవోగా ఉంటే బాగుంటుందని భావించిన ప్రభుత్వం ఆమేరకు నియామకం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Also Read : జాతీయ భద్రతా సలహాదారుగా మూడోసారి కూడా అజిత్ ధోవల్.. ఎందుకో తెలుసా?

ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రస్తుతం టీటీడీ ఇన్ ఛార్జి ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డి అక్కడినుంచి పూర్తిగా రిలీవ్ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే ఆయన సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. 2022 మే నెలలో టీటీడీ అప్పటి ఈవో జవహర్ రెడ్డి బదిలీ కావడంతో ఆ తరువాత అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికే ఈవోగా ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి అతనే టీటీడీ ఇంచార్జి ఈవోగా కొనసాగుతున్నారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో ధర్మారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో కొత్త ప్రభుత్వం ఆయన్ను ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే.. రఘురామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు

తిరుమల సమాచారం..
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి క్యూలైన్లు వెలుపల ఉన్నాయి. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం పడుతుంది. ఇదిలాఉంటే.. శుక్రవారం తిరుమల శ్రీవారిని 66,782 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71కోట్లు లభించింది.

ట్రెండింగ్ వార్తలు