తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే.. రఘురామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేస్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే.. రఘురామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు

Raghu Rama Krishna Raju and CM Ramesh

MLA Raghu Rama Krishna Raju : తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేస్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు మాట్లాడారు. నా కోరిక నెరవేరింది. కూటమి ఘన విజయం సాధించిందని తెలిపారు. ఉండి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించినందుకు స్వామి వారిని దర్శించుకున్నాను. గత ప్రభుత్వ బాధితులందరి తరఫున స్వామి వారికి కృతజ్ఞతలు తెలిపాను. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందాలని కోరుకున్నట్లు రఘురామకృష్ణం రాజు చెప్పారు.

Also Read : Tamilsai : అమిత్ షా సీరియస్ వార్నింగ్‌.. అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చిన తమిళిసై సౌందరరాజన్

అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. అనకాపల్లిలో భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు. కూటమి ప్రభుత్వం రావడం, పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయడంతో స్వామివారిని దర్శించుకున్నా. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలిపినట్లు సీఎం రమేష్ చెప్పారు.