Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్‌షాక్‌.. జైలు శిక్ష ఖాయమా?

అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. హుష్ మనీ కేసులో న్యూయార్క్ జ్యూరీ ట్రంప్ ను దోషిగా తేల్చింది.

Donald Trump Guilty : అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. పోర్న్ స్టార్ కు అక్రమ చెల్లింపులు (హుష్ మనీ) చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ట్రంప్ ను దోషిగా తేల్చింది. మొత్తం 34 ఆరోపణలపై ట్రంప్ ను 14 సభ్యుల కోర్టు జ్యూరీ దోషిగా ప్రకటించింది. ఈ కేసులో ట్రంప్ కు జులై11న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ట్రంప్ కు గరిష్ఠంగా నాలుగేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు, జరిమానాలు మాత్రమే విధించారు.

Also Read : Rafale M Fighter : సముద్ర జలాల్లో ఆధిపత్యమే టార్గెట్‌.. హిందూ మహాసముద్రంలో డ్రాగన్‌కు చెక్‌

డొనాల్డ్ ట్రంప్ తనను 2006లో లైంగికంగా వాడుకున్నాడని, ఆ విషయం బయటకు రాకుండా ఉండేందుకు 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో పెద్ద మొత్తం సొమ్మును ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ నుంచి ముట్టచెప్పారని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని ప్రచార కార్యక్రమాలకోసం అందిన విరాళాల నుంచి ఖర్చు చేశారని, అందుకోసం బిజినెస్ రికార్డులన్నింటిని తారుమారు చేశారన్నది ట్రంప్ పై ప్రధాన ఆరోపపణ. ట్రంప్ తరపు న్యాయవాదులు మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. కేవలం డబ్బుల కోసమే మాజీ అధ్యక్షుడిపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించారు. మొత్తం 34 అంశాల్లో ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి. సుదీర్ఘ కాలంగా ఇరుపక్షాల వాదనలు కొనసాగుతూ వచ్చాయి.

Also Read : AI Revolution : టెక్‌వరల్డ్‌లో ఏఐ విప్లవం.. ఏఐ టెకీలకు భారీ వేతనాలు

ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్ ను నవంబర్ లో జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసే రిపబ్లిక్ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభంకానున్నాయి. జులై 11న ట్రంప్ కు జైలు శిక్ష విధించినా ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి శిక్ష పడినా ఈ కేసులో పైకోర్టుకు ట్రంప్ అప్పీల్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

దోషిగా తేలిన తరువాత కోర్టు బయటకు వచ్చిన ట్రంప్ మీడియాతో మాట్లాడారు.. జ్యూరీ నిర్ణయం అవమానకరమని ట్రంప్ అభివర్ణించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటానని అన్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు