Pakistan: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ ఔట్‌.. ఆతిథ్య జ‌ట్టుకు సాయం చేసిన వ‌రుణుడు.. గ‌గ్గొలు పెడుతున్న పాక్ ఫ్యాన్స్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో లీగ్ ద‌శ‌లోనే పాకిస్తాన్ పోరాటం ముగిసింది

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో లీగ్ ద‌శ‌లోనే పాకిస్తాన్ పోరాటం ముగిసింది. శుక్ర‌వారం ఫోర్లిడా వేదిక‌గా అమెరికా, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే ర‌ద్దైంది. ఈ నేప‌థ్యంలో ఇరు జ‌ట్ల‌కు అంపైర్లు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు. దీంతో పాకిస్తాన్ గ్రూపు ద‌శ‌లో ఇంటి ముఖం ప‌ట్టాల్సి వ‌చ్చింది.

అమెరికా గ్రూపు ద‌శ‌లో నాలుగు మ్యాచులు ఆడింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా.. రెండు మ్యాచుల్లో గెలిచింది. మొత్తం 5 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉంది. అటు పాకిస్తాన్..అమెరికా, భార‌త్ చేతుల్లో ఓడి సూప‌ర్ 8 అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. కెన‌డా పై ఘ‌న విజ‌యం సాధించింది. త‌న ఆఖ‌రి మ్యాచ్‌ల‌లో (జూన్ 16న‌) ఐర్లాండ్ పై గెలిచినా కూడా పాకిస్తాన్ ఖాతాలో నాలుగు పాయింట్లే ఉంటాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా అధికారికంగా సూప‌ర్ 8 అర్హ‌త సాధించింది. గ్రూపు-ఏ నుంచి భార‌త్ ఇప్ప‌టికే సూప‌ర్ 8కి చేరుకున్న సంగ‌తి తెలిసిందే

Team India : సూప‌ర్ 8లో భార‌త జ‌ట్టు ప్ర‌త్య‌ర్థులు వీరేనా..!

ఒక‌వేళ అమెరికా, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగి.. ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడిపోయి ఉండి, త‌న చివ‌రి మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ తేడాతో విజ‌యం సాధిస్తే ఆ జ‌ట్టు సూప‌ర్ 8కి వెళ్లే అవ‌కాశం ఉండేది. అయితే.. పాక్ ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు. దీంతో ఆ జ‌ట్టు అభిమానులు తీవ్ర నిరాశ‌కు గురి అయ్యారు. అమెరికా చేతిలో ఓడిపోకుండా ఉంటే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని అంటున్నారు. త‌మ జ‌ట్టు ఆట‌గాళ్ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తొలిసారి సూప‌ర్ 8కి చేరుకున్న అమెరికా.. జూన్ 19న ద‌క్షిణాఫ్రికాతో, జూన్ 21న వెస్టిండీస్‌తో, జూన్ 23న‌(ఇంగ్లాండ్ లేదా స్కాట్లాండ్‌)ల‌తో త‌ల‌ప‌డ‌నుంది.

T20 World Cup 2024 : హెల్మెట్‍లో ఇరుక్కుపోయిన బాల్.. బ్యాట‌ర్ క‌ష్టాలు చూడాల్సిందే.. వీడియో

ట్రెండింగ్ వార్తలు