Team India : సూప‌ర్ 8లో భార‌త జ‌ట్టు ప్ర‌త్య‌ర్థులు వీరేనా..!

అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20ప్ర‌పంచ‌క‌ప్ 2024లో గ్రూప్ స్టేజీలో మ్యాచ్‌లు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి.

Team India : సూప‌ర్ 8లో భార‌త జ‌ట్టు ప్ర‌త్య‌ర్థులు వీరేనా..!

PIC Credit : BCCI

Team India – T20 World Cup 2024 : అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20ప్ర‌పంచ‌క‌ప్ 2024లో గ్రూప్ స్టేజీలో మ్యాచ్‌లు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఇప్ప‌టికే శ్రీలంక‌, న్యూజిలాండ్ వంటి జ‌ట్లు గ్రూప్ ద‌శ నుంచి ఇంటి ముఖం ప‌ట్టాయి. సూప‌ర్ 8కి చేరే జ‌ట్ల‌పై దాదాపుగా ఓ అంచ‌నా వ‌చ్చేసింది. భార‌త్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌, ద‌క్షిణాఫ్రికా లు ఇప్ప‌టికే సూప‌ర్ 8కి అర్హ‌త సాధించాయి. మ‌రో మూడు స్థానాల కోసం గ‌ట్టి పోటీ నెల‌కొంది.

ఈ రోజు ఫ్లోరిడా వేదిక‌గా అమెరికా, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో అమెరికా గెలిచినా, లేదంటే వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ ర‌ద్దైనా అమెరికా సూప‌ర్ 8కి చేరుకుంటుంది. అప్పుడు పాకిస్తాన్ త‌న చివ‌రి మ్యాచ్‌తో సంబంధం లేకుండా టోర్నీ నుంచి ఇంటి ముఖం ప‌ట్ట‌నుంది.

Team India : కెన‌డాతో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్‌..

ఇదిలా ఉంటే.. సూప‌ర్ 8 ద‌శ‌లో టీమ్ఇండియాతో త‌ల‌ప‌డ‌బోయే ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రో దాదాపుగా తెలిసిపోయింది. జూన్ 20న భార‌త జ‌ట్టు త‌న తొలి సూప‌ర్ 8 మ్యాచ్‌లో గ్రూప్ సిలో అగ్ర‌స్థానంలో ఉన్న జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక ప్ర‌కారం అది అఫ్గానిస్తాన్. లేదంటే వెస్టిండీస్ కూడా కావొచ్చు. ప్ర‌స్తుతం గ్రూప్ సిలో అఫ్గాన్‌, విండీస్ రెండు జ‌ట్ల పాయింట్లు స‌మానంగా ఉన్న‌ప్ప‌టికీ మెరుగైన ర‌న్‌రేట్ కార‌ణంగా అఫ్గానిస్తాన్ అగ్ర‌స్థానంలో ఉంది. అయితే.. ఇరు జ‌ట్లు ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. త‌మ ఆఖ‌రి మ్యాచుల్లో గెలుపోట‌ముల బ‌ట్టి భార‌త ప్ర‌త్య‌ర్థి మారే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం అఫ్గానిస్తాన్ తోనే భార‌త్ త‌ల‌ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

టీమ్ఇండియా త‌న రెండో మ్యాచ్‌ను జూన్ 22న ఆడ‌నుంది. గ్రూప్ డిలో రెండో స్థానంలో నిలిచిన జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. గ్రూప్‌డిలో సౌతాఫ్రికా ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో ఉంది. ఈ స్థానంతోనే ఆ జ‌ట్టు గ్రూప్ ద‌శ‌ను ముగించే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో భార‌త ప్ర‌త్య‌ర్థి బంగ్లాదేశ్‌/నెదర్లాండ్స్ కావొచ్చు.

USA vs PAK : అమెరికా చేతిలో ఓట‌మి.. పాక్ జ‌ట్టు పై యూఎస్ఏ అధికారి వ్యాఖ్య‌లు.. క్రికెట్‌లో పాకిస్తాన్‌కు అనుభ‌వం లేదేమో..!

భార‌త జ‌ట్టు త‌న మూడో మ్యాచ్‌ను జూన్ 24న ఆడ‌నుంది. గ్రూప్ బిలో అగ్ర‌స్థానంలో ఉన్న జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఇదే స్థానంతో ఆసీస్ గ్రూపును ముగించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

సూప‌ర్ 8లో భార‌త్ ఆడే మ్యాచులు ఇవే..

జూన్ 20 – భారత్‌ వర్సెస్ అఫ్గానిస్థాన్‌/వెస్డిండీస్ (గ్రూప్ సిలో అగ్ర‌స్థానంలో ఉన్న జ‌ట్టు)
జూన్‌ 22 – భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌/నెదర్లాండ్స్‌ (గ్రూప్‌-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టు)
జూన్ 24 – భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా (గ్రూప్ బిలో అగ్ర‌స్థానంలో నిలిచిన జ‌ట్టు )