USA vs PAK : అమెరికా చేతిలో ఓట‌మి.. పాక్ జ‌ట్టు పై యూఎస్ఏ అధికారి వ్యాఖ్య‌లు.. క్రికెట్‌లో పాకిస్తాన్‌కు అనుభ‌వం లేదేమో..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ఆతిథ్య అమెరికా జ‌ట్టు సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతుంది.

USA vs PAK : అమెరికా చేతిలో ఓట‌మి.. పాక్ జ‌ట్టు పై యూఎస్ఏ అధికారి వ్యాఖ్య‌లు.. క్రికెట్‌లో పాకిస్తాన్‌కు అనుభ‌వం లేదేమో..!

US Official Banter on Pakistan Upset at T20 World Cup 2024

USA vs PAK : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ఆతిథ్య అమెరికా జ‌ట్టు సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతుంది. కెన‌డా, పాకిస్తాన్ ల‌పై విజ‌యం సాధించి సూప‌ర్ 8కి అర్హ‌త సాధించేందుకు అడుగుదూరంలో ఉంది. త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో నేడు (శుక్ర‌వారం జూన్‌14న‌) ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, లేక వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయినా స‌రే.. ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండా సూప‌ర్ 8కి చేరుకుంటుంది. ఓడిపోయినా కూడా ఇత‌ర జ‌ట్ల ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా అవ‌కాశాలు ఉంటాయి.

కాగా.. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్‌ను అమెరికా సూప‌ర్ ఓవ‌ర్‌లో 5 ప‌రుగుల తేడాతో ఓడించింది. దీనిపై స్పందించాల్సిందిగా US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ను ఓ విలేక‌రి కోరారు. బహుశా క్రికెట్ గేమ్‌లో పాకిస్తాన్ కు అనుభ‌వం లేదేమో అంటూ మిల్ల‌ర్ ఫ‌న్నీగా స‌మాధానం ఇచ్చారు.

T20 World Cup 2024 : హెల్మెట్‍లో ఇరుక్కుపోయిన బాల్.. బ్యాట‌ర్ క‌ష్టాలు చూడాల్సిందే.. వీడియో

‘నా నైపుణ్యం ఉన్న ప్రాంతానికి మించిన విషయాలపై మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు నేను తరచుగా ఇబ్బందుల్లో పడతాను. అలాగే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఖచ్చితంగా ఆ వర్గంలో ఉంటుందని నేను భావిస్తున్నా. ‘అని మిల్లర్ చెప్పాడు.

జూన్ 6న డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో పాకిస్తాన్‌, అమెరికా జ‌ట్టు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 159 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో అమెరికా సైతం నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 159 ప‌రుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో అమెరికా మొద‌ట బ్యాటింగ్ చేసింది. వికెట్ కోల్పోయి 18 ప‌రుగులు చేసింది. అయితే.. పాకిస్తాన్ వికెట్ కోల్పోయి 13 ప‌రుగులే చేయ‌డంతో అమెరికా 5 ప‌రుగుల తేడాతో గెలిచింది.

Team India : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ‌ధ్య‌లోనే స్వ‌దేశానికి రానున్న ఇద్ద‌రు టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు..!