T20 World Cup 2024 : హెల్మెట్‍లో ఇరుక్కుపోయిన బాల్.. బ్యాటర్ కష్టాలు చూడాల్సిందే.. వీడియో
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

Ball stuck in Bangladesh batter Tanzid Hasan helmet
T20 World Cup 2024 – Tanzid Hasan : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బౌలర్ వేసిన బౌన్సర్ ను షాట్ ఆడేందుకు ప్రయత్నించిన బ్యాటర్ హెల్మెట్‌లో బాల్ ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కింగ్‌స్టన్ వేదికగా శుక్రవారం నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ బౌలర్ వివియన్ కింగ్మా వేసిన బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడేందుకు బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ ప్రయత్నింంచాడు.
అయితే.. బంతి తంజిద్ హెల్మెట్ గ్రిల్ మధ్యలో ఇరుక్కుపోయింది. వెంటనే అతడు హెల్మెట్ తీసి బంతిని నేలకు కొట్టినా బాల్ మాత్రం బయటికి రాలేదు. వెంటనే బంగ్లాదేశ్ ఫిజియో వచ్చి బ్యాటర్‌ను పరీక్షించాడు. ఎటువంటి గాయం కాకపోవడంతో తంజిమ్ బ్యాటింగ్ కొనసాగించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (64 నాటౌట్; 46 బంతుల్లో 9 ఫోర్లు)హాఫ్ సెంచరీ చేశాడు. తంజిద్ హసన్ (35; 26 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్) లు రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులకే పరిమితమైంది. దీంతో బంగ్లాదేశ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ENG vs Oman : టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్.. 3.1 ఓవర్లలోనే లక్ష్య ఛేదన
View this post on Instagram