ENG vs Oman : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన ఇంగ్లాండ్‌.. 3.1 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్య ఛేద‌న‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో సూప‌ర్ 8 ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే ఘ‌న విజ‌యం సాధించాల్సిన త‌రుణంలో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్ జ‌ట్టు జూలు విదిల్చింది.

ENG vs Oman : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన ఇంగ్లాండ్‌.. 3.1 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్య ఛేద‌న‌

ENG vs Oman

England vs Oman : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో సూప‌ర్ 8 ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే ఘ‌న విజ‌యం సాధించాల్సిన త‌రుణంలో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్ జ‌ట్టు జూలు విదిల్చింది. ప‌సికూన ఒమ‌న్ జ‌ట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. త‌న నెట్‌ర‌న్‌రేటు(-1.800 నుంచి +3.081కి )ను గ‌ణ‌నీయంగా పెంచుకుంది.

స్కాట్లాండ్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్ వర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా.. ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సూప‌ర్ 8 అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. అదే స‌మ‌యంలో ఆడిన మూడు మ్యాచుల్లో ఆస్ట్రేలియా గెల‌వ‌డంతో గ్రూపు బి నుంచి సూప‌ర్ 8 బెర్తును ఖాయం చేసుకుంది. మ‌రో బెర్తు కోసం స్కాట్లాండ్ తో ఇంగ్లాండ్ పోటీ ప‌డుతోంది. స్కాట్లాండ్ ఖాతాలో 5 పాయింట్లు ఉండ‌గా, నెట్‌ర‌న్‌రేట్ +2.164గా ఉంది.

ఈ ద‌శ‌లో ఇంగ్లాండ్‌కు భారీ విజ‌యం అవ‌స‌ర‌మైంది. ఈ క్ర‌మంలో ఒమ‌న్ నిర్దేశించిన‌ ల‌క్ష్యాన్ని కేవ‌లం 3.1 ఓవ‌ర్ల‌లోనే ఛేద‌న చేసి ప్ర‌పంచ రికార్డు సృష్టించింది.

New Zealand : మాతో ఆడుంటే న్యూజిలాండ్‌కు ఈ గ‌తి ప‌ట్టేది కాదు.. ఐపీఎల్ ఆడితే ఫ‌లితం ఇలాగే.. పాక్ జ‌ర్న‌లిస్ట్ వ్యాఖ్య‌లు..

ఈ మ్యాచ్‌లో ఒమ‌న్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. 13.2 ఓవ‌ర్ల‌లో 47 ప‌రుగులుకు ఆలౌటైంది. ఒమ‌న్ బ్యాట‌ర్ల‌లో షోయ‌బ్ ఖాన్ (11) ఒక్క‌డే రెండు అంకెల స్కోరు చేశాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్లో ఆదిల్ ర‌షీద్ నాలుగు వికెట్లు తీశాడు. మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చ‌ర్ చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ 3.1 ఓవ‌ర్ల‌లోనే రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది.

కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ (24 నాటౌట్; 8 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లాండ్‌ 101 బంతులు, 8 వికెట్లు మిగిలి ఉండానే విజ‌యాన్ని సాధించింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో బంతుల ప‌రంగా అత్యంత వేగంగా ఛేద‌న చేసిన జ‌ట్టుగా ఇంగ్లాండ్ చ‌రిత్ర సృష్టించింది. అంత‌క‌ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. 2014 ప్ర‌పంచ‌క‌ప్‌లో నెద‌ర్లాండ్స్ పై లంక 90 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని అందుకుంది.

New York : బుల్డోజ‌ర్లు వ‌చ్చేశాయి.. నేలమట్టం కానున్న న్యూయార్క్‌ క్రికెట్ స్టేడియం.. భారత్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ జ‌రిగింది ఇక్క‌డే..

ఆస్ట్రేలియా పైనే ఆశ‌లు..

ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ ఖాతాలో 3 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ +3.018కి చేరుకుంది. త‌మ ఆఖ‌రి లీగు మ్యాచ్‌లో న‌మీబియాతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ విజ‌యం సాధిస్తే అప్పుడు ఆ జ‌ట్టు ఖాతాలో 5 పాయింట్లు వ‌చ్చి చేరుతాయి. అదే స‌మ‌యంలో స్కాట్లాండ్ త‌మ చివ‌రి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవాలి. అప్పుడు స్కాట్లాండ్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల పాయింట్లు స‌మం అయితాయి. నెట్‌ర‌న్‌రేటు మెరుగ్గా ఉన్న ఇంగ్లాండ్ సూప‌ర్ 8కి చేరుకుంటుంది. ఒక‌వేళ న‌మీబియా పై ఓడినా, లేదంటే ఆస్ట్రేలియా పై స్కాట్లాండ్ గెలిచినా కూడా ఇంగ్లాండ్ ఇంటి ముఖం ప‌ట్ట‌క త‌ప్ప‌దు.

Pakistan : పాకిస్తాన్ అదృష్టం మామూలుగా లేదుగా.. త‌ట్టాబుట్టా స‌ర్దుకోవాల్సిందే..!