New Zealand : మాతో ఆడుంటే న్యూజిలాండ్‌కు ఈ గతి పట్టేది కాదు.. ఐపీఎల్ ఆడితే ఫలితం ఇలాగే.. పాక్ జర్నలిస్ట్ వ్యాఖ్యలు..
ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన లీగుల్లో ఐపీఎల్ ఒకటి.

Mitchell McClenaghan shuts down Pakistan journalist
New Zealand – Mitchell McClenaghan : ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన లీగుల్లో ఐపీఎల్ ఒకటి. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రికత్తల కారణంగా పాకిస్తాన్ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడడం లేదు. ఐసీసీ అసోసియేషన్ దేశాలతో సహా దాదాపు అన్ని దేశాల క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఉంటారు. ఈ లీగ్‌లో సత్తా చాటితే డబ్బు రావడంతో పాటు జాతీయ జట్టుకు సెలక్ట్ అయిన ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ఈ లీగ్ పై పాకిస్తాన్ కు చెందిన ప్రస్తుత, మాజీ ప్లేయర్లు తమ అక్కసును అప్పుడప్పుడు బయటపెడుతూనే ఉంటారు.
తాజాగా న్యూజిలాండ్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో విఫలం అవుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీనికి ఐపీఎల్ కారణం అంటూ ఓ పాకిస్తాన్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై కివీస్ మాజీ పేసర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూపు సిలో ఉన్న వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రినిడాడ్ వేదికగా గురువారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (39 బంతుల్లో 68 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులే చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (33 బంతుల్లో 40) రాణించాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (1) , డేవాన్ కాన్వే (5) లు విఫలం కావడంతో 13 పరుగుల తేడాతో విండీస్ గెలిచింది.
కివీస్ అవకాశాలు సంక్లిష్టం..
ఈ ఓటమితో న్యూజిలాండ్ సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. తన చివరి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో విజయం సాధించినా కూడా ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో న్యూజిలాండ్ తదుపరి దశకు వెళ్లడం దాదాపుగా సాధ్యం కాదు. దీనిపై ఓ పాక్ జర్నలిస్ట్ కామెంట్ చేశాడు.
ఆటగాళ్లు జాతీయ జట్టు కంటే డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఇలాగే జరుగుతుందని చెప్పాడు. పాకిస్తాన్ టూర్‌ను ప్రపంచకప్ 2024 కోసం సన్నాహకంగా ఉపయోగించుకోకుండా కివీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌కే ప్రాధాన్యం ఇచ్చారని, దీని వల్ల ఇప్పుడు వారు గ్రూపు దశ నుంచే నిష్ర్కమిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశాడు.
టీ20 ప్రపంచకప్ ముందు కివీస్ జట్లు పాకిస్తాన్‌లో పర్యటించింది. అయితే.. స్టార్ ఆటగాళ్లు విలిమమ్సన్, డేవాన్ క్వాన్ వంటి ప్రధాన ఆటగాళ్ల అంతా ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు. దీంతో అంతగా అనుభవం లేని యువ జట్టును పాక్ పర్యటనకు పంపారు. 5 మ్యాచుల టీ20 సిరీస్ 2-2తో సమమైంది.
Pakistan : పాకిస్తాన్ అదృష్టం మామూలుగా లేదుగా.. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే..!
పాక్ జర్నలిస్ట్ చేసిన కామెంట్ల పై కివీస్ మాజీ పేసర్ మిచెల్ మెక్‌క్లెనాఘన్ స్పందించాడు. పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ సి జట్టుతో పాటు ఐర్లాండ్, అమెరికా చేతుల్లో ఓడిపోయిందనే విషయాన్ని గుర్తు చేశాడు. ఇలాంటి జట్టుతో ఆడినా పెద్దగా ఉపయోగం ఉండదు అనే అర్థం వచ్చేలా ఇన్ డైరెక్ట్‌గా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
మరో వైపు ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మూడు మ్యాచులు ఆడగా ఒక్క మ్యాచులోనే గెలిచిన పాకిస్తాన్ అవకాశాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ఆఖరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచినా ఇతర జట్ల సమీకరణాలపైనే ఆధారపడాల్సి ఉంది. అయితే.. పాక్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అదే జరిగితే పాకిస్తాన్ కూడా గ్రూపు స్టేజీ నుంచే ఇంటి ముఖం పట్టనుంది.
Very poor take.
You lost games to our C side, Ireland and the USA https://t.co/jfHQl2b0Xa
— Mitchell McClenaghan (@Mitch_Savage) June 13, 2024