Team India : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ‌ధ్య‌లోనే స్వ‌దేశానికి రానున్న ఇద్ద‌రు టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది.

Team India : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ‌ధ్య‌లోనే స్వ‌దేశానికి రానున్న ఇద్ద‌రు టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు..!

pic credit : BCCI

Team India – T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా మూడు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి సూప‌ర్ 8కి అర్హ‌త సాధించింది. లీగ్ ద‌శ‌లో త‌న ఆఖ‌రి మ్యాచ్‌ను శ‌నివారం ఫ్లోరిడా వేదిక‌గా కెన‌డాతో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే టేబుల్ టాప‌ర్‌గా టీమ్ఇండియా గ్రూప్ ద‌శ‌ను ముగిస్తుంది. కెన‌డాతో మ్యాచ్ త‌రువాత ఫ్లోరిడా నుంచి భార‌త్.. వెస్టిండీస్‌కు ప‌య‌నం కానుంది.

అక్క‌డ సూప‌ర్ 8 మ్యాచ్‌ల‌తో పాటు సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఈ నేప‌థ్యంలో భార‌త మేనేజ్‌మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఫ్లోరిడా నుంచి శుభ్‌మ‌న్ గిల్‌, అవేశ్ ఖాన్‌లు స్వ‌దేశానికి రానున్న‌ట్లు తెలుస్తోంది.

New Zealand : న్యూజిలాండ్‌కు ఇదేం క‌ర్మ‌.. ఇంకో రెండు మ్యాచులు ఉన్నా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ఔట్‌..

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు రింకూ సింగ్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్‌తో పాటు శుభ్‌మ‌న్ గిల్‌, అవేశ్ ఖాన్‌లు ట్రావెలింగ్ రిజ‌ర్వులుగా ఎంపిక చేశారు. 15 మంది స‌భ్యులు గ‌ల బృందంలో ఎవ‌రైనా గాయ‌ప‌డితే వారి స్థానంలో వీరిలో ఒకరిని ఎంపిక‌ చేసేందుకు ఈ ప‌ని చేశారు. రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి కోహ్లి ఓపెన‌ర్‌గా వ‌స్తుండ‌డంతో రెగ్యుల‌ర్ ఓపెన‌ర్ అయిన య‌శ‌స్వి జైస్వాల్ బెంచీకే ప‌రిమితం అయ్యాడు. దీంతో మ‌రో ఓపెన‌ర్ అయిన గిల్ సేవ‌లు ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో అవ‌స‌రం లేద‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ భావించింద‌ట‌.

వెస్టిండీస్‌లోని పిచ్‌లు చాలా స్లో ఉంటాయి. దీంతో అక్క‌డ ఇద్ద‌రు పేస‌ర్ల‌తోనే టీమ్ఇండియా బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో బుమ్రాతో పాటు అర్ష్‌దీప్‌, సిరాజ్‌ల‌లో ఒక‌రికి మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఎలాగూ మూడో పేస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తాడు. ఈ నేప‌థ్యంలో వీరిలో ఒక‌రు గాయ‌ప‌డినా అవేశ్ అవ‌స‌రం ఉంద‌ని మేనేజ్‌మెంట్ బావించింద‌ట‌. ఈ క్ర‌మంలోనే గిల్‌, అవేశ్ ఖాన్‌ల‌ను స్వదేశానికి పంపంచ‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. రింకూ సింగ్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్ ట్రావెలింగ్ రిజ‌ర్వ్‌లుగా కొన‌సాగ‌నున్నారు.

ENG vs Oman : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన ఇంగ్లాండ్‌.. 3.1 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్య ఛేద‌న‌