New Zealand : న్యూజిలాండ్‌కు ఇదేం క‌ర్మ‌.. ఇంకో రెండు మ్యాచులు ఉన్నా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ఔట్‌..

అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పెను సంచ‌ల‌నాలు న‌మోదు అవుతున్నాయి.

New Zealand : న్యూజిలాండ్‌కు ఇదేం క‌ర్మ‌.. ఇంకో రెండు మ్యాచులు ఉన్నా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ఔట్‌..

New Zealand

New Zealand out from T20 World Cup 2024 : అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పెను సంచ‌ల‌నాలు న‌మోదు అవుతున్నాయి. ఖ‌చ్చితంగా సూప‌ర్ 8కి చేరుకుంటాయి అని అనుకున్న జ‌ట్లు ఇంటి ముఖం ప‌డుతున్నాయి. తాజాగా న్యూజిలాండ్ జ‌ట్టు టీ20ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 8 రేసు నుంచి అధికారికంగా నిష్ర్క‌మించింది. ప‌పువా న్యూ గినియా పై అఫ్గానిస్తాన్ విజ‌యం సాధించ‌డంతో కివీస్‌కు ఈ గ‌తి ప‌ట్టింది. న్యూజిలాండ్ గ్రూపు స్టేజీలో మ‌రో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది.

ట్రినిడాడ్ వేదిక‌గా జరిగిన మ్యాచ్‌లో ప‌పువా న్యూగినియా పై అఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ప‌పువా న్యూగినియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. 19.5 ఓవ‌ర్ల‌లో 95 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఈ ల‌క్ష్య‌న్ని అఫ్గానిస్తాన్ 15.1 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్తాన్‌కు ఇది వ‌రుస‌గా మూడో విజ‌యం. దీంతో ఆ జ‌ట్టు సూప‌ర్ 8కి అర్హ‌త సాధించింది.

Pakistan : పాకిస్తాన్ అదృష్టం మామూలుగా లేదుగా.. త‌ట్టాబుట్టా స‌ర్దుకోవాల్సిందే..!

గ్రూపు సిలో అఫ్గానిస్తాన్‌తో పాటు వెస్టిండీస్‌, ఉగాండా, ప‌పువా న్యూగినియా, న్యూజిలాండ్ జ‌ట్లు ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచుల్లో వెస్టిండీస్‌, అఫ్గానిస్తాన్ జ‌ట్లు గెలిచాయి. ప్ర‌స్తుతం రెండు జ‌ట్ల ఖాతాల్లో ఆరు పాయింట్లు ఉన్నాయి. మెరుగైన ర‌న్‌రేటు కార‌ణంగా అఫ్గాన్ జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉండ‌గా వెస్టిండీస్ జ‌ట్టు రెండో స్థానంలో ఉంది. ఉగాండా మూడు మ్యాచులు ఆడ‌గా ఓ మ్యాచ్‌లో గెల‌వ‌డంతో రెండు పాయింట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతోంది.

ఇక ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోయిన న్యూజిలాండ్ పాయింట్ల ఖాతాను తెర‌వ‌లేదు. ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ విజ‌యాలు సాధించినా కూడా కివీస్ సూప‌ర్ 8కి చేరుకోలేదు. ఎందుకంటే.. రెండు మ్యాచుల్లో గెలిస్తే ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు వ‌స్తాయి. అయితే.. ఇప్ప‌టికే అఫ్గాన్‌, వెస్టిండీస్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. ప్ర‌తి గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్న జ‌ట్లే సూప‌ర్ 8కి చేరుకుంటాయి. వెస్టిండీస్‌, అఫ్గాన్ జ‌ట్ల పాయింట్ల‌ను అధిగ‌మించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో గ్రూపు స్టేజీ నుంచే న్యూజిలాండ్ ఇంటి ముఖం ప‌ట్టింది.

New York : బుల్డోజ‌ర్లు వ‌చ్చేశాయి.. నేలమట్టం కానున్న న్యూయార్క్‌ క్రికెట్ స్టేడియం.. భారత్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ జ‌రిగింది ఇక్క‌డే..