Team India : కెన‌డాతో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్‌..

అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20ప్ర‌పంచ‌క‌ప్ 2024లో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది.

Team India : కెన‌డాతో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్‌..

Team India Practice Session in Florida Cancelled

Team India – T20 World Cup 2024 : అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20ప్ర‌పంచ‌క‌ప్ 2024లో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది. హ్యాట్రిక్ విజ‌యాలు సాధించి గ్రూపు-ఏలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుంది. సూప‌ర్ 8కి ఇప్ప‌టికే చేరుకున్న భార‌త్ లీగ్ ద‌శ‌లో త‌న చివ‌రి మ్యాచ్‌ను శ‌నివారం ఫ్లోరిడా వేదిక‌గా కెన‌డాతో ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే భార‌త ఆట‌గాళ్లు ఫ్లోరిడాకు చేరుకున్నారు.

కాగా.. మ్యాచ్ కు ముందు టీమ్ఇండియాకు ఏకైక ప్రాక్టీస్ సెష‌న్‌ను ఏర్పాటు చేశారు. అయితే అందుతున్న నివేదిక‌ల ప్ర‌కారం ఈ ప్రాక్టీస్ సెష‌న్‌ను ర‌ద్దు చేశారు. ప్ర‌స్తుతం ఫ్లోరిడాలో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉండ‌డంతో ఇలా చేశారు. దీంతో కెన‌డాతో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు ఎలాంటి ప్రాక్టీస్ ఉండ‌దు.

USA vs PAK : అమెరికా చేతిలో ఓట‌మి.. పాక్ జ‌ట్టు పై యూఎస్ఏ అధికారి వ్యాఖ్య‌లు.. క్రికెట్‌లో పాకిస్తాన్‌కు అనుభ‌వం లేదేమో..!

గ‌త కొన్ని రోజులుగా ఫ్లోరిడాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు సంభ‌విస్తున్నాయి. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం ఎమ‌ర్జెన్సీని విధించింది. మ‌రో మూడు నాలుగు రోజులు ఇదే ప‌రిస్థితి ఉంటుందని తెలిపింది. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఇక భార‌త్‌, కెన‌డా మ్యాచ్‌కు వ‌ర్షం ఆటంకాలు క‌లిగించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఒక‌వేళ మ్యాచ్ ర‌ద్దు అయితే ఇరు జ‌ట్ల‌కు ఒక్కొ పాయింట్ కేటాయిస్తారు. అయితే.. మ్యాచ్ జ‌రిగితేనే టీమ్ఇండియాకు ఉప‌యోగం. ఎందుకంటే కీల‌కమైన సూప‌ర్ 8కి ముందు భార‌త జ‌ట్టు ఆడ‌నున్న చివ‌రి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌లా ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంటుంది.

T20 World Cup 2024 : హెల్మెట్‍లో ఇరుక్కుపోయిన బాల్.. బ్యాట‌ర్ క‌ష్టాలు చూడాల్సిందే.. వీడియో