Donald Trump : కరోనా కల్లోలానికి కారణం చైనాయే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలానికి కారణం చైనా అంటూ కుండబద్దలు కొట్టారు. అమెరికాతోపాటు ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలానికి చైనా కారణమన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందేన్నారు. విధ్వంసం సృష్టించిన చైనా...అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు 10 ట్రిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.

China Virus:  : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలానికి కారణం చైనా అంటూ కుండబద్దలు కొట్టారు. అమెరికాతోపాటు ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలానికి చైనా కారణమన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందేన్నారు. విధ్వంసం సృష్టించిన చైనా…అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు 10 ట్రిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. వూహాన్‌ ల్యాబ్‌లో ఏం జరుగుతుందో ఫౌచీకి తెలుసన్నారు ట్రంప్. ఫౌచీ అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.

కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లో తయారైందంటూ అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తొంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇదే వాదన చేశారు. ఆ తర్వాత పలు పరిశోధనలు కూడా వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్ బయటికి వచ్చిందని చెప్తున్నాయి. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు కూడా ల్యాబ్‌ నుంచే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ వైరస్‌ చైనా సృష్టే అని, జీవాయుధంగా మార్చేందుకు డ్రాగన్‌ చేసిన పరిశోధనల ఫలితమే మహమ్మారి విలయమని ఇటీవల బ్రిటన్‌ సహా పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తాను ముందే చెప్పానని ఎవరూ పట్టించుకోలేదన్నారు ట్రంప్.

మరోవైపు కరోనాను జీవాయుధంగా మార్చేందుకు చైనాకు అమెరికా ఆర్థిక సాయం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికాయే వైరస్‌ను సృష్టించిందంటూ చైనా కూడా ఆరోపణలు చేస్తోంది. దీంతో వైరస్‌ రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది.

Read More : Weather Forecast : వానలే వానలు…మూడు రోజులూ తెలంగాణలో వర్షాలు

ట్రెండింగ్ వార్తలు