CHINA COVID CASES : చైనాను వదలని కరోనా.. ఒక్కరోజే 13వేల కేసులు నమోదు.. కొత్త వేరియంట్ తో కలకలం

చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 13వేల146 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...

CHINA COVID CASES : చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలో ఆదివారం ఒక్కరోజే 13వేల146 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో షాంఘైలోనే 70శాతం కేసులు నమోదయ్యాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ఠ కేసులుగా చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. అయితే ఊరటనిచ్చే అంశం ఏమిటంటే పాజిటివ్ కేసులు నమోదు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్య లేకపోవటంతో అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఆ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ లో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చి వాయు వేగంతో వ్యాప్తి చెందుతుండటం చైనా అధికారులను కలవరపెడుతోంది.

China Covid 4th Wave : చైనాలో కరోనా విజృంభణ.. 2ఏళ్ల రికార్డు బ్రేక్.. ఒక్కరోజే భారీగా కేసులు

కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలించుకుంటూ వస్తున్నాయి. చైనాలో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయాచెంగ్లోనూ లాక్ డౌన్ విధించారు. హైనన్ ప్రావిన్సులోని సాన్యా నగరానికి వాహన రాకపోకలపై నిషేధం విధించారు. రెండున్నర కోట్ల జనాభా ఉన్న షాంఘైలో కొవిడ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడ అత్యధిక స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను అధికారులు చేపట్టారు. అయితే ప్రస్తుత కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షల పట్ల చైనీయుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ఆంక్షలు సడలిస్తున్న సమయంలో దేశంలో లాక్ డౌన్ విధిస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Delta Variant : డెల్టా వేరియంట్ కు చెక్ పెడుతున్న చైనా

ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ తో వణికిపోతోన్న చైనాలో తాజాగా ఒమిక్రాన్ ఉపరకం వెలుగు చూసినట్లు అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. షాంఘైకి సమీపంలోని కొవిడ్ బాధితుడిలో ఈ కొత్తరకాన్ని వైద్యులు గుర్తించారు. ఈ కొత్త వైరస్ రకాన్ని ఒమిక్రాన్ వేరియట్ కు చెందిన బీఏ.1.1 నుంచి పరివర్తన చెందిందిగా అంచనా వేస్తున్నారు. మరోవైపు యూకేలోనూ కొవిడ్ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. యుకేలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ ప్రభావాన్ని చూపుతోందని, కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్స్ ఈ సబ్ వేరియంట్ 10శాతం వృద్ధిరేటు ఉందని డబ్ల్యూహెచ్ఒ ఇప్పటికే హెచ్చరించింది. 2019 సంవత్సరంలో కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పుడు కూడా తొలుత చైనా, యుకేల్లోనే కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ప్రస్తుతం కొత్త ఒమిక్రాన్ వేరియంట్లతో ఆ దేశాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు