Covid Variant: ఇకపై వచ్చే కరోనా వేరియంట్ లలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది: WHO

ఇకపై వచ్చే కరోనా వేరియంట్ల వలన వ్యాప్తి ఎక్కువ కలిగి..తీవ్రత అధికంగానూ, ప్రాణాపాయం కూడా కలిగే అవకాశం ఉందని WHO వెల్లడించింది.

Covid Variant: కరోనా వైరస్ మహమ్మారిగా అవతరించి, ప్రపంచంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. కోట్లాది మంది మహమ్మారి భారిన పడ్డారు, లక్షలాది మంది మృతి చెందారు. మహమ్మారిని అంతం చేసేందుకు శాస్త్రవేత్తలు శాయశక్తులా కృషిచేసి వాక్సిన్ ను కూడా కనిపెట్టారు. అయినా కొత్త వేరియంట్ల రూపంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. డెల్టా, ఓమిక్రాన్ రకాలతో కరోనా వ్యాప్తి మరింత పెరిగింది. ఈక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చేసిన ప్రకటన మరింత ఆందోళనకరంగా ఉంది. మునుషుల్లోకి పాకిన తరువాత రూపాంతరం చెందుతున్న కరోనా..మున్ముందు దశలు మార్చుకుని..మనుషులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని WHOలో Covid -19 సాంకేతిక విభాగానికి సారధ్యం వహిస్తున్న మరియా వాన్ కెర్కోవ్ అన్నారు.

Also read: Vijayasai Reddy: ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నచందంగా కేంద్ర బడ్జెట్

ప్రజలు వాక్సిన్ తీసుకున్నప్పటికీ..మున్ముందు వచ్చే కరోనా వేరియంట్లు.. మనుషుల రోగనిరోధకతను తప్పించుకుని..మరింత ప్రభావం చూపుతాయని మరియా అన్నారు. ఇకపై వచ్చే కరోనా వేరియంట్ల వలన వ్యాప్తి ఎక్కువ కలిగి..తీవ్రత అధికంగానూ, ప్రాణాపాయం కూడా కలిగే అవకాశం ఉందని WHO వెల్లడించింది. పరిస్థితి అంతవరకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్త పడాలని..కరోనా నిబంధనలు పాటించాలని WHO సూచిస్తుంది. ఇక పై కరోనా.. సీజన్లవారీగా వచ్చి పోతుంటుందని చెప్పిన మరియా వాన్ కెర్కోవ్.. సరైన పద్ధతులు పాటిస్తే కరోనాను ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.

Also read: FabiSpray : కరోనాకు చెక్.. ఇండియా ఫస్ట్ నాజల్‌ స్ప్రే వ్యాక్సిన్‌ వచ్చేసింది.. 99శాతం సేఫ్..!

ట్రెండింగ్ వార్తలు