Covid Vaccine For Kids : చిన్నారులకు ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్..ఈయూ ఆమోదం

జర్మనీ,ఆస్ట్రియా,రష్యా సహా పలు యూరప్ దేశాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న వేళ యూరోపియన్ యూనియన్ కు చెందిన డ్రగ్ రెగ్యులేటర్-యురోపియన్‌ మెడిసిన్స్ ఏజెన్సీ(EMA) కీలక నిర్ణయం

Covid Vaccine For Kids  జర్మనీ,ఆస్ట్రియా,రష్యా సహా పలు యూరప్ దేశాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న వేళ యూరోపియన్ యూనియన్ కు చెందిన డ్రగ్ రెగ్యులేటర్-యురోపియన్‌ మెడిసిన్స్ ఏజెన్సీ(EMA) కీలక నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 11 ఏళ్లు ఉండే చిన్న పిల్లలకు ఫైజర్​ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు EMA గురువారం ఆమోదం తెలిపింది.

కరోనా వైరస్​ అంతకంతకూ విస్తరిస్తుండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నపిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు యురోపియన్‌ మెడిసిన్స్ ఏజెన్సీ అనుమతించడం ఇదే మొదటిసారి. ఇక,ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అధికారులు ఇప్పటికే 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల వారికి టీకాలు వేయడం ప్రారంభించారు.

యూరప్ ప్రస్తుతం మహమ్మారి యొక్క కేంద్రంగా ఉంది. అత్యవసర చర్యలు తీసుకోకపోతే యూరప్ లో వచ్చే ఏడాది మార్చి నాటికి 20 లక్షల కోవిడ్ మరణాలు నమోదయ్యే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ALSO READ Floating City : ప్రపంచంలో తొలిసారిగా..నీటిపై తేలియాడే నగరం ఏర్పాటుకి ఒప్పందం

ట్రెండింగ్ వార్తలు