Gang Clash in Prison : జైల్లో గ్యాంగ్ వార్..24 మంది ఖైదీలు మృతి..48మందికి గాయాలు

జైల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24మంది ఖైదీలు మృతి చెందారు. మరో 48మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సైనికులు, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Gang Clash in Prison : ఈక్వెడార్​లోని గ్వయాక్విల్‌​ ప్రాంతీయ జైలులో రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన వివాదం కాస్తా హింసాత్మకంగా మారింది. చిలికి చిలికి గాలివానగా మారిన ఇరు వర్గాల ఘర్షణ కాస్తా బాంబులు, తుపాకులతో దాడి చేసుకునేవరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఏకంగా 24 మంది ఖైదీలు మృతిచెందారు. జైలులో ఖైదీలు రెండు వర్గాలుగా మారిపోయిన క్రమంలో ఇరు వర్గాల మధ్యా తీవ్ర ఘర్షణ జరిగింది. ఇది హింసాత్మకంగా మారి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 24 మంది ఖైదీలు మృతి చెందగా..మరో 48 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా జైలు అధికారులే వెల్లడించారు.

Read more : Jagadguru Paramhans: భారత్ ను హిందుదేశంగా ప్రకటించి..ముస్లిం, క్రైస్తవుల జాతీయతను రద్దుచేయండి..లేదంటే జలసమాధి అవుతా.

ఈ జైలు వార్ పై పోలీసులు సైనికులు సహాయంతో రంగంలోకి దిగి అల్లర్లను అదుపు చేయడానికి శతవిధాలా యత్నించారు. అలా ఐదు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే జరిగాల్సిందంతా జరిగిపోయింది. కానీ..ఈ ఘర్షణ అలాగే కొనసాగితే మరికొంతమంది ఖైదీలు చనిపోయే ప్రమాదాన్ని ఆపగలిగారు. కాగా, ఈక్వెడార్‌లోని మూడు జైళ్లలో గత ఫిబ్రవరిలో జరిగిన ఘర్షణల్లో 79 మంది మరణించారు. జూలైలో జరిగిన మరో ఘటనలో 22 మంది ఖైదీలు మృతిచెందారు. ఇలా ఈ ప్రాంతంలో జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణలు సర్వసాధారణంగా మారిపోయాయి. దీంతో పలువురు ఖైదీలు మృతి చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

Read more :Covid-19 Effect‌ : కరోనా ప్రభావంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తగ్గిన మనిషి ఆయుర్దాయం

 

ట్రెండింగ్ వార్తలు