Brazil Rain effect : బ్రెజిల్ లో కుండపోత వర్షం.. కొండచరియలు విరిగిపడి 14మంది మృతి

బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో రాష్ట్రంలో కొండ చరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు.

Brazil Rain effect : బ్రెజిల్ దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఆ దేశంలోని రియో డి జనీరో రాష్ట్రంలో కొండ చరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఆగ్నేయ బ్రెజిలియన్ రాష్ట్రమైన రియో ​​డి జెనీరోలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. నగరంలోని మునిసిపల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..అంగ్రా డోస్ రీస్‌లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. గత 48 గంటల్లో 655 మిమీ (26 అంగుళాలు) వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా నగరంలో ఆరుగురు మరణించినట్లు అధికారులు గుర్తించారు.

Brazil Mudslides : బ్రెజిల్‌లో వరదల బీభత్సం.. 78కి చేరిన మృతుల సంఖ్య

మరోవైపు పారాటీ పట్టణంలో కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించారు. పారాటీలో ఒక్కరోజులోనే 332 మిమీ వర్షపాతం నమోదైంది. ఇది ఆరు నెలల సగటు వర్షపాతం. పొంటానెగ్రా తీర ప్రాంతంలో ఏడు ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. 22 కంటే ఎక్కువ పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. 71 కుటుంబాలు నిరాశ్రయులయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మెస్క్విటా మునిసిపాలిటీలో మూడు రోజుల భారీ వర్షాలు కురుస్తుండటంతో 38ఏళ్ల వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అంగ్రా డాస్ రీస్ నగరంలో భారీ వర్షాలకారణంగా తొమ్మిది మంది వరదల్లో చిక్కుకుని తప్పిపోయినట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ, అగ్నిమాపక అధికారులను ఐదుగురిని రక్షించారు.

Brazil Landslide : కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి.. 32 మందికి గాయాలు.. వీడియో

వర్షప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా దక్షిణ కోస్తా నగరాలు, రియో ​​డి జనీరో రాష్ట్రంలోని బైక్సాడా ఫ్లూమినెన్సు ప్రాంతంలో బురదపేరుకుపోయింది. స్థానిక పోలీసులు 24గంటల్లో 850 కాల్స్ కు సమాధానం ఇచ్చారని, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో 114 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి ప్రారంభంలో సావోపాలో రాష్ట్రం రోజుల తరబడి భారీ వర్షాలతో అంతలాకుతలమైన విషయం విధితమే. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 24మంది మరణించారు. 1,500 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

ట్రెండింగ్ వార్తలు