Russia-Ukraine war: యుద్ధ భూమిలో ఏంజెలీనా జోలీ పర్యటన.. అక్కడి పరిస్థితిని చూసి ఆమె ఏమన్నారంటే..

ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. బాంబుల వర్షం కురిపిస్తు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుంది. ప్రపంచంలోని అనేక దేశాలు దాడులు ఆపాలంటూ రష్యాను హెచ్చరించినా...

Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. బాంబుల వర్షం కురిపిస్తు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుంది. ప్రపంచంలోని అనేక దేశాలు దాడులు ఆపాలంటూ రష్యాను హెచ్చరించినా పుతిన్ వెనక్కు తగ్గడం లేదు. రష్యా సైన్యం దాడులతో లక్షలాది మంది ఉక్రెయిన్ ను విడిచి వెళ్తుండగా, కొందరు తుపాకీ పట్టి రష్యా సేనలను నిలువరించే పనిలో నిమగ్నమయ్యారు. చిన్నారులు, మహిళలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ పర్యటించింది. ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ ప్రత్యేక ప్రతినిధిగా ఆమె శనివారం లివిన్ సిటీలో పర్యటించింది.

పర్యటనలో భాగంగా క్రమాటోర్క్సొ రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఆమె అక్కడి వాలంటీర్లతో మాట్లాడింది.అక్కడ జరిగిన క్షిపణి దాడిలో గాయపడిన చిన్నారులను జోలి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వాలంటీర్లు, అక్కడ తలదాచుకుంటున్న పిల్లలంతా దాదాపు రెండు నుంచి 10ఏళ్ల లోపే పిల్లలేనని, వాళ్లు ఇప్పటికీ షాక్ లోనే ఉన్నారని ఆవేదన వెలుబుచ్చింది. యుద్ధ ప్రభావం వారి మనసుల్లో ఎంత భయాన్ని నింపిందో నేను ఊహించగలనని, వారికి అండగా నిలబడటం ఎంతో అవసరమంటూ ఏజెలినా జోలి పేర్కొంది.

అయితే ఆమె స్టేషన్ లోని పిల్లలతో, వాలంటీర్లతో సరదాముచ్చటిస్తూ ఫొటోలు దిగింది. అంతకుముందు ఏజెలినా జోలి ఆకస్మిక సందర్శనంతో అక్కడివారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనంతరం ఆమె బోర్డింగ్ స్కూలని సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించింది. వారికి యుద్ధం సమయంలో ఎదురైన అనుభవాలను తెలుసుకుంది. అనంతరం విద్యార్థులు ఏంజెలినా జోలీతో ఫొటోలు దిగారు. అలాగే దాడిలో గాయపడిన వారికి వైద్య సహాయం, కౌన్సెలింగ్‌ అందజేస్తున్న ఉక్రెయిన్‌ వాలంటీర్‌లతో కూడా ఏజెలినా జోలీ సమావేశమయ్యారు.

ట్రెండింగ్ వార్తలు