1 Village,2 Languages : మహిళలు ఒక భాష..పురుషులు మరొక భాష మాట్లాడే వింత గ్రామం

అదొక వింత గ్రామం. ఒకే గ్రామంలో ఆడవారు ఒక భాష..మగవారు మరో భాష మాట్లాడతారు. 10 ఏళ్ల దాటిని పిల్లలు కూడా అలాగే మాట్లాడాలి. అలా మాట్లాడటం మాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంటారు.

Men and Women Speak Different Languages : భారత దేశం భిన్నమతాలు..విభిన్నమైన భాషల మేలు కలయిక. భారత్ లోని పలు భాషలు..యాసలు ఉన్నాయనే విషయం తెలిసిందే. కానీ ఓ రాష్ట్రంలో ఉన్నవారికి ఒకే భాష మాట్లాడతారు. ఆయా ప్రాంతాలను బట్టి భాష యాస మారుతుందేమో గానీ భాష మాత్రం అదే ఉంటుంది.కానీ గ్రామం మాత్రం ఫుల్ డిఫరెంట్. ఎక్కడా లేని విధంగా ఆ గ్రామంలో మహిళలకు ఒక రకం భాష..పురుషులకు మరో రకం భాష మాట్లాడతారు. అలాగన వారి మధ్య ఇబ్బందులేమీ లేవు. ఒకరు మాట్లాడే భాష మరొకరికి బాగానే అర్థం అవుతుంది. ఈ వింత గ్రామం ఆఫ్రికా దేశాల్లో ఒకటైన నైజీరియాలో ఉంది. సౌత్ నైజీరియాలోని ఉబాంగ్ అనే గ్రామంలో పురుషులు ఒక భాష, మహిళలు మరో భాష అలా ఒకే గ్రామంలో రెండు భాషలు మాట్లాడుతారు. బహుశా ఇటువంటి వింత గ్రామం ప్రపంచ వ్యాప్తంగా ఇదే అయి ఉంటుందేమో.

ఉబాంగ్ గ్రామంలో ప్ర‌జలు వ్య‌వ‌సాయం మీదే ఆధార‌ప‌డి జీవిస్తుంటారు. కానీ..ఉబాంగ్ గ్రామం ప్రత్యేక..మ‌గ‌వాళ్లు ఒక భాష‌.. ఆడ‌వాళ్లు ఇంకో భాషను మాట్లాడటం. అలా వేరు వేరు భాష‌లు మాట్లాడటం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తారు వారు.ఉబాంగ్ అనే తెగ వాళ్లు ఎక్కువ‌గా ఉంటారు. దీంతో ఆ గ్రామానికి కూడా అదే పేరు వచ్చింది. వాళ్లు మాట్లాడే రెండు భాష‌లు మ‌హిళ‌లు, పురుషుల‌కు అర్థం అవుతాయి కానీ..ఎవ‌రు మాట్లాడే భాష వాళ్లే మాట్లాడుతారు. ఒకరి భాష మరొకరికి వచ్చినా మాట్లాడకపోవటం విశేషం. అలా చేస్తే దేవుడి ఆశీర్వాదానికి దూరం అయిపోయి చెడు జరుగుతుందని వారి నమ్మకం.కానీ వీరు మాట్లాడే రెండు భాషల్లో కొన్ని పదాలు కామ‌న్‌గా ఉంటాయ‌ట‌. ఉదాహరణకు..ఒక స్త్రీ యమ్‌ను ‘ఇరుయ్’ అని పిలవగా, పురుషులు మరోలా పిలుస్తారట. మహిళలు దుస్తులను ‘అరిగా’ అని పురుషులు దీనిని ‘ఎన్కి’ అని పిలుస్తారు. కానీ ఆ రెండు భాష‌ల‌కు అస్స‌లు సంబంధం ఉండ‌దు.

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..ఆ గ్రామంలో పిల్లలు అంతా అటు మహిళలు మాట్లాడే భాష అయినా ఇటు పురుషులు మాట్లాడే భాష మాట్లాడినా పట్టించుకోరు. అలా 10 ఏళ్ల వ‌య‌సు వరకు మాత్రమే ఏ భాష మాట్లాడినా ఫరవాలేదు. కానీ 10ఏళ్లు దాటితే మాత్రం ఆడపిల్లు ఆడవారు మాట్లాడే భాష..మగపిల్లలు మగవారు మాట్లాడే భాషే మాట్లాడాలి. ఇక్కడ మరొక నిబంధనలు ఉంది. మ‌గ పిల్ల‌లు 10 ఏళ్లు దాటితే ఖ‌చ్చితంగా పురుషుల భాష‌నే మాట్లాడాలి. మ‌హిళ‌ల భాష‌ను పురుషులు మాట్లాడితే వింత‌గా..అనుమానంగా చూస్తార‌ట‌. కాబట్టి ఈ గ్రామం నియమనిబందనలు తెలిసిన వాళ్లు ఎవ్వ‌రూ త‌మ భాష కాకుండా వేరే భాష మాట్లాడటానికి యత్నించరు.

పైగా వీరు మాట్లాడే ఆ రెండు భాష‌ల‌కు లిపి లేదు.కేవలం మాట్లాడటం వరకే. లిపి లేకపోవటంతో వారు మాట్లాడే భాషను స్కూళ్ల‌లో కూడా నేర్పించ‌రు. కాక‌పోతే.. త‌మ క‌మ్యూనిటీ భాష‌ల‌ను భ‌విష్య‌త్తు త‌రాలు కూడా మ‌రిచిపోకూడ‌ద‌నే దీన్ని సంప్రదాయంగా పెట్టారు వారి తెగల పెద్దలు.

కాగా మన భారత్ లో కూడా లిపి లేని భాషలు..లిపి కనుమరుగు అయిపోయిన భాషలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన ఆదివాసీలు మాట్లాడే భాషలకు లిపి ఉండదు. దీంట్లో గోండు భాష‌ కూడా ఒకటి.కేవ‌లం మాట్లాడ‌ట‌మే..కాగా నైజీరియాలోని 500 ప్రాంతీయ భాషలు కొన్నేళ్లలో అంతరించిపోతాయని సైంటిస్టులు అంటున్నారు.నైజీరియాలో ప్రధాన భాషలు ఇగ్బో, యోరుబా, హౌసా. అనేక జాతుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి నైజీరియా ప్రజలు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు.

ట్రెండింగ్ వార్తలు