Ukraines Crisis:తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా భారత్ గళం.. బుచాలో పౌరుల హత్యలపై దర్యాప్తుకు డిమాండ్

తొలిసారి రష్యాకు వ్యతిరేకంగాయుక్రెయిన్ తరపున భారత్ గళం విప్పింది..బుచా నగరంలో సాధారణ పౌరుల హత్యలపై స్వతంత్ర దర్యాప్తుకు డిమాండ్ కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో డిమాండ్ చేసింది.

Civilian killings in Ukraines Bucha deeply disturbing : యుక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయటాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు వ్యతిరేకించాయి. కానీ భారత్ మాత్రం వ్యతిరేకటచంలేదు..అలాగని సమర్థించటంలేదు. ఎందుకంటే రష్యాతో భారత్ కు ఉన్న సత్సంబంధాలు. కానీ రష్యా యుక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించి 40 రోజులుపైగా అయ్యాక మొదటిసారిగా
భారత్ తీవ్రంగా స్పందించింది. యుక్రెయిన్ లోని బుచా నగరంలోని సాధారణ పౌరుల రష్యా సేతలు అత్యంత దారుణంగా చంపిన ఘటనను తీవ్రంగా ఖండించింది భారత్. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్ చేసింది. బుచా వీధుల్లో పిట్టల్లా రాలిపోయినట్టున్న పౌరుల మృత దేహాల ఫొటోలు, వీడియోలు వెలుగులోకి రావడంతో భారత్ మంగళవారం (ఏప్రిల్ 5,2022)స్పందించింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ అంశంపై మాట్లాడారు. ‘‘భద్రతా పరిస్థితులు దిగజారాయని అన్నారు.బుచాలో పౌరుల హత్యలపై వస్తున్న వార్తలు ఎంతో కలతకు గురిచేస్తున్నాయి. దీన్ని మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. స్వతంత్ర దర్యాప్తునకు పిలుపునిస్తున్నాం’’ అని తిరుమూర్తి ప్రకటన చేశారు.

‘‘మానవతా అవసరాల పట్ల అంతర్జాతీయ సమాజం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. కనీస మానవ అవసరాలు, వైద్య సరఫరాలు సజావుగా సాగేందుకు సురక్షిత మార్గాలు తెరవడానికి మేము మద్దతిస్తున్నాం. యుక్రెయిన్ లో ఉన్న దారుణ మానవతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశానికి, దాని పొరుగు దేశాలకు ఔషధాలు, ఇతర నిత్యావసర సరుకులను పంపిస్తున్నాం. మరింత వైద్య సరఫరాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని తిరుమూర్తి ప్రకటన చేశారు.

యుద్ధం ఆరంభమైన నాటి నుంచే తాము చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బలంగా చెబుతూ వచ్చామని తిరుమూర్తి గుర్తు చేశారు. అమాయక పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు దౌత్య మార్గం ఒక్కటే ఆచరణీయంగా ఉండాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు