వందలాది పక్షుల ప్రాణాలు తీసిన న్యూ ఇయర్ వేడుకలు

Italy : hundreds of birds dead after new years eve : న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు క్రాయర్స్ కాలుస్తూ..సంబరాల్లో తేలిపోతుంటారు ప్రజలు. ప్రతీ సంవత్సరం జరిగే తంతే ఇది. కానీ ప్రజలకు సంబరాలుగా మారిన ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు వేలాది పక్షుల పాలిట మృత్యుకేళిగా మారింది. ఇటలీ రాజధాని రోమ్‌లో రెండురోజుల క్రితం జరిగిన న్యూ ఇయర్‌ సంబరాలు ప్రజల్లో ఆనందం వేలాది పక్షుల ప్రాణాలు తీశాయి.

నూతన సంవత్సర పండుగ వేడుకల్లో భాగంగా..ప్రజలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. తరువాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కానీ తెల్లారి చూసే సరికి వందలాది పక్షులు ఎక్కడపడితే అక్క చచ్చిపడి ఉన్నాయి. రోమ్ ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వీధుల్లో పదుల సంఖ్యలో పక్షులు చనిపోయి ఉన్నాయి.

ఈ పక్షుల మృతికి స్పష్టమైన కారణాలేవీ లేనప్పటికీ.. జంతు హక్కుల సంఘాలు మాత్రం ఈ ఘటనను “ఊచకోత”కు పక్షులు గూడు కోసం ఉపయోగించే చెట్ల ఆకులపై టపాసుల ప్రభావం చూపి వాటి మరణానికి కారణమైందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్ (ఓఐపీఏ) ప్రతినిధి లోరెడానా డిగ్లియో విచారం వ్యక్తం చేశారు.

ఒకేసారి పెద్ద ఎత్తున టపాసులు కాల్పడం వల్ల పక్షులు భయపడిపోయి గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, కిటికీలకు లేదా విద్యుత్‌ లైన్లకు కొట్టుకుని చచ్చిపోయి ఉండొచ్చని ఆయన చెప్పారు.

బాణసంచా ప్రదర్శన ప్రతి సంవత్సరం జంతువులకు, పక్షులకు చాలా సమస్యలుగా మారుతున్నాయని తెలిపింది. కాగా..బాణసంచా కాల్చడాన్ని రోమ్ నగరం నిషేధించినప్పటికీ..న్యూ ఇయర్ వేడుకల్లో ఈ నిషేధం ఉల్లంఘన జరిగింది.

ఫలితంగా వందలాది పక్షుల మరణాలు సంభవించాయి.బాణసంచా కాల్చటం జంతువులకు ప్రమాదం ఏర్పడుతున్న కారణంగా ఓఐపీఏ ఇటాలియన్ శాఖ వ్యక్తిగత ఉపయోగం కోసం బాణసంచా కాల్చడాన్ని, అమ్మకాలను నిషేధించాలని పిలుపునిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు