California Shooting: క్యాలిఫోర్నియాలో దుండగుడి కాల్పులు.. పది మంది మృతి?

ఆదివారం ఉదయం లాస్ ఏంజెల్స్ కౌంటీలోని, మానెటరీ పార్కు వద్ద చైనా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. అందరూ ఒకే చోట గుమిగూడి ఉన్న సమయంలో గన్ మెషీన్ చేత బట్టుకున్న ఒక దుండగుడు, అక్కడి వాళ్లపై కాల్పులకు తెగబడ్డాడు.

California Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. క్యాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో నిర్వహించిన చైనా న్యూ ఇయర్ వేడుకల్లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పది మందికిపైగా మరణించినట్లు అంచనా.

Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం లాస్ ఏంజెల్స్ కౌంటీలోని, మానెటరీ పార్కు వద్ద చైనా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. అందరూ ఒకే చోట గుమిగూడి ఉన్న సమయంలో గన్ మెషీన్ చేత బట్టుకున్న ఒక దుండగుడు, అక్కడి వాళ్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పది మందికిపైగా మరణించి ఉండొచ్చని అంచనా. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని కూడా అధికారులు భావిస్తున్నారు. అలాగే చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే అందరూ తలోదిక్కు పారిపోయేందుకు ప్రయత్నించారు. కొందరు దగ్గర్లోని రెస్టారెంట్లో దాక్కున్నారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి గన్ మెషీన్‌తో కాల్పులు జరిపాడు.

Bihar: హిట్ అండ్ డ్రాగ్.. బిహార్‌లో వృద్ధుడిని ఢీకొని 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వృద్ధుడు మృతి

అతడు అనేక రౌండ్ల కాల్పులకు తెగబడ్డాడు. ఒక రౌండ్ అయిపోగానే, రీలోడ్ చేసి, మళ్లీ కాల్పులు జరిపాడు. ఇలా చాలా రౌండ్లు కాల్పులు జరపడంతో బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే, మృతులు, క్షతగాత్రుల విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాల్పుల సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు