International Yoga Day 2023 : సంప్రదాయ పడికట్టుతో చీరలు ధరించిన మహిళలు యోగా..

జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నౌవారి చీర ధరించిన మహిళలు యోగా చేశారు.

Mumbai Womens 'nauvari' Sarees Yoga

Mumbai Womens ‘nauvari’ Sarees Yoga : జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నౌవారి చీర ధరించిన మహిళలు యోగా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో మహిళలు అంతా యోగా చేస్తు ‘ఓం’కారాన్ని జపిస్తున్నారు. సుఖాసనంలో కళ్లుమూసుకుని కూర్చుని యోగా చేశారు. నౌవారి (కచ్చా,సాకచ్చ,లుగాడే అని కూడా పిలుస్తారు) మహారాష్ట్రలో మహిళలు ధరించే తొమ్మిది గజాల పొడవు ఉండే చీరలను వారి సంప్రదాయ రీతిలో కచ్చాపోసి కట్టుకుంటారు.

తొమ్మిది గజాలు పొడవు ఉన్న చీర నుంచి ‘నౌవారి’అనే పేరు వచ్చింది. మహారాష్ట్ర మహిళల సంప్రదాయ చీరకట్టు ఇది. ప్రత్యేకమైన ఈ చీరకట్టుతోను ముక్కులకు నత్తులు పెట్టుకున్న మహిళలు మహారాష్ట్ర సంప్రదాయంగా ఉంటుంది. ఈ అటువంటి చీరకట్టుతో మహిళలు యోగా చేయటం ప్రత్యేకతను సంతరించుకుంది.

ట్రెండింగ్ వార్తలు