Top Smartphone Deals : అమెజాన్‌లో రూ. 20వేల లోపు ధరకే టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్.. లిమిటెడ్ ఆఫర్..!
Top Smartphone Deals : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ.20వేల లోపు టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్‌లను పొందవచ్చు. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
- Sreehari A
- Published On : July 21, 2024 / 04:57 PM IST
Top Smartphone Deals
Top Smartphone Deals : అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈరోజు (ఆదివారం) రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. మీకోసం అద్భుతమైన డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. రెండు రోజులు జరుగనున్న ఈవెంట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, అప్లియన్సెస్, పీసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.
Read Also : Amazon Prime Day Sale : ఈ నెల 20 నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. లాంచ్ కానున్న కొత్త ల్యాప్‌టాప్స్ ఇవే..!
సాధారణ అమ్మకపు ధరతో పోలిస్తే.. అధిక తగ్గింపు ధరలకు పొందవచ్చు. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్ లిస్టును అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ.20వేల లోపు టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్‌లను పొందవచ్చు. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
కొనుగోలుదారులు, డిస్కౌంట్‌లతో పాటు రూ. 20వేల లోపు స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్ బెనిఫిట్స్, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లతో పాటు, 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇటీవల లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ సాధారణంగా రూ. 19,999 ఉండగా, రూ.16999కు పొందవచ్చు. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లకు కూడా అందిస్తున్నాయి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. రూ. 20వేల లోపు టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ :
- వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఒరిజినల్ ధర రూ. 19,999, తగ్గింపు ధర : రూ. 16,999
- రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫోన్ అసలు ధర రూ. 24,999, తగ్గింపు ధర రూ. 15,249
- ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ ధర రూ. 24,999, తగ్గింపు ధర : రూ. 16,999
- రెడ్‌మి నోట్ 13 5జీ అసలు ధర రూ. 20,999, తగ్గింపు ధర రూ. 15,499
- వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 అసలు ధర రూ. 26,999, తగ్గింపు ధర రూ. 18,999
- వివో వై28ఎస్ 5జీ అసలు ధర రూ. 17,999, తగ్గింపు ధర రూ. 13,249
