OPPO Pad Mini Launch : వావ్.. ఒప్పో నుంచి సూపర్ మినీ టాబ్లెట్.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర తెలిస్తే షాకే..!
OPPO Pad Mini Launch : 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్ ఒప్పో ప్యాడ్ మినీ ధర రూ. 94,999గా ఉంది. ఈ టాబ్లెట్ లావెండర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒప్పో ప్యాడ్ మినీ అక్టోబర్ 29వ తేదీ నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
OPPO Pad Mini Launch
- ఒప్పో ప్యాడ్ మినీ 8.8-అంగుళాల 2.5K డిస్ప్లే
- ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్
- ఒప్పో ప్యాడ్ మినీలో 8,000mAh బ్యాటరీ సెటప్
OPPO Pad Mini Launch : ఒప్పో లవర్స్ మీకోసమే.. ఒప్పో నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త టాబ్లెట్ వచ్చేసింది. ఒప్పో ప్యాడ్ మినీలో 8.8-అంగుళాల 2.5K (2,520 x 1,680 పిక్సెల్స్) ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
ఈ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఒప్పో ప్యాడ్ మినీలో 8,000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi, బ్లూటూత్ USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ టాబ్లెట్‌లో 13MP రియర్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఈ టాబ్లెట్‌తో పాటు ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్, ఒప్పో ఎంకో X4 TWS ఇయర్‌బడ్స్‌ను కూడా రిలీజ్ అయింది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
ఒప్పో ప్యాడ్ మినీ ధర ఎంతంటే? :
8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో ఈ టాబ్లెట్ సింగిల్ వేరియంట్ ధర రూ. 94,999కు లభిస్తోంది. ఒప్పో ప్యాడ్ మినీ లావెండర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ టాబ్లెట్ అక్టోబర్ 29వ తేదీ నుంచి కంపెనీ ఆన్లైన్ స్టోర్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
ఒప్పో ప్యాడ్ మినీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ టాబ్లెట్‌లో 8.8-అంగుళాల 2.5K (2,520 x 1,680 పిక్సెల్స్) ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 344పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. మ్యాట్ ఫినిషింగ్‌తో పాటు లో గ్లేర్‌తో కూడా వస్తుంది.
ఒప్పో ప్యాడ్ మినీ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్ అడ్రినో 829 జీపీయూతో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఈ టాబ్లెట్‌లో 13MP రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ టాబ్లెట్‌లోని సెన్సార్లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఇ-కంపాస్ యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఒప్పో ప్యాడ్ మినీ 8,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ టాబ్లెట్ కొలతలు 194.38 x 132.38 x 5.46mm ఉండగా బరువు సుమారుగా 282 గ్రాములు ఉంటుంది.
