North korea Kim Jong un : కరోనా కేసులు కాదని చెబుతునే..ఉత్తర కొరియా రాజధానిలో లాక్‌డౌన్ విధించిన ‘కిమ్’ ప్రభుత్వం

ఉత్తర కొరియాలో మరోసారి కరోరా కల్లోలం రేపుతోందా? కరోనా కేసులు పెరుగుతున్నాయా? దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో అధికారులు 5 రోజుల లాక్ డౌన్ విధించటం చూస్తే నిజమేననిపిస్తోంది కానీ ఉత్తర కొరియా మాత్రం అదేంలేదంటోంది. లాక్ డౌన్ విధించింది కరోనా కేసుల వల్ల కాదంటోంది.

North korea Kim Jong un : ఉత్తర కొరియాలో మరోసారి కరోరా కల్లోలం రేపుతోందా? కరోనా కేసులు పెరుగుతున్నాయా? దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో అధికారులు 5 రోజుల లాక్ డౌన్ విధించటం చూస్తే నిజమేననిపిస్తోంది కానీ ఉత్తర కొరియా మాత్రం అదేంలేదు. శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం వల్ల మాత్రమే లాక్ డౌన్ ప్రకటించాం అని చెబుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావొద్దని హెచ్చరించింది ప్రభుత్వం. అయినా అది కరోనా వల్ల కాదు శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం వల్లేనంటోంది. కానీ ఉత్తర కొరియా ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేని దక్షిణ కొరియా అంటోంది. కరోనా కేసులు పెరగటం వల్లే రాజధాని నగరంలో లాక్ డౌన్ విధించారంటోంది.

ప్రపంచం అంతా కరోనాతో పోరాడుతున్నవేళ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాత్రం కరోనాలేదు…గిరోనాలేదు. మందులు లేవు..మాస్కులు అవసరం లేదంటూ ప్రగల్బాలు పలికారు. దేశంలోకి కరోనా ఎంటర్ అయితే మీపని ఖతం అంటూ అధికారులకు హుకుం జారీ చేశారు అప్పట్లో కిమ్. కానీ కరోనా కిమ్ అయినా ఒక్కటే అమెరికా అధ్యక్షుడైనా ఒక్కటే..అందుకే కిమ్ ఉన్నాడని తెలిసినా ఉత్తరకొరియాలో కూడా కోవిడ్ ఎంటర్ అయ్యింది. కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో కిమ్ కనిపించకుండా పోయాడు. అప్పుడు కిమ్ కు కరోనా సోకిందనే వార్తలు వచ్చాయి. సాధారణం తన ఆరోగ్య విషయాలు బయటకు పొక్కనివ్వని కిమ్ చాలారోజుల పాటు కనిపించకుండా చికిత్స తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత కిమ్ కనిపించినప్పుడు చాలా బరువు తగ్గిపోయి సన్నగా అయిపోయారని కూడా వార్తలు వచ్చాయి. కానీకిమ్ మాత్రం కిమ్మనలేదు.

North Korea : దక్షిణకొరియా నుంచి వచ్చే బెలూన్ల వల్లే మా దేశంలోకి కోవిడ్ వ్యాపించింది : కిమ్ జోంగ్

ఇదిలా ఉంటే ఉత్తర కొరియాలో మరోసారి లాక్ డౌన్ విధించటంతో కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కానీ ఎప్పటిలాగానే ఉత్తర కొరియా మాత్రం లాక్ డౌన్ విధించింది కరోనా వల్ల కాదు కేవలం శ్వాసకోసం సంబంధిత సమస్యల వల్లేనంటోంది. సియోల్ (దక్షిణ కొరియా రాజధాని) కేంద్రంగా వెలువడే ఉత్తర కొరియా పత్రిక ఒకటి ప్యాంగ్యాంగ్ లో లాక్ డౌన్ విషయాన్ని, ప్రభుత్వ నోటీసుతో సహా బుధవారం (జనవరి 24,2023) ప్రచురించింది.

ఈ నోటీసులో అధికారులు శ్వాసకోశ వ్యాధి అని వివరించినప్పటికీ అవి మాత్రం కరోనానే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పక్క దేశం దక్షిణ కొరియా కూడా అటువంటి సందేహమే వ్యక్తంచే్తోంది. నగరంలో లాక్ డౌన్ గురించి ప్యాంగ్యాంగ్ పౌరులకు ముందే సమాచారం ఉందని, మంగళవారం అక్కడి ప్రజలు పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేసి తీసుకెళ్లడం కనిపించిందని ఉత్తర కొరియా వార్తలు ప్రచురించే వెబ్ సైట్ ‘ఎన్ కే న్యూస్’ వెల్లడించింది.

2022 వరకు మా దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించలేదని చెబుతూ వచ్చిన ఉత్తర కొరియా తగిన మూల్యాన్నే చెల్లించిదని కానీ ఈ వార్తలు కూడా బయటకు రాకుండా చేసిందనే వాస్తవం. రాజధాని ప్యాంగ్యాంగ్ లో కరోనా కేసులు గుర్తించినట్లు 2022 మొదట్లో ప్రకటించింది నార్త్ కొరియా.. కానీ వాటిని చాలా వేగంగా జయించామని చెప్పుకొచ్చింది. ఇక మా దేశంలో ఒక్క కేసు కూడా లేదని ప్రకటించింది. ఈక్రమంలో మరోసారి ఉత్తరకొరియాలో కరోనా జాడలు కనిపిస్తున్నాయి. అంతేకాదు అవి పెరిగాయని అందుకే రాజధాని ప్యాంగ్యాంగ్ లో లాక్ డౌన్ విధించారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎప్పటిలాగానే ప్రభుత్వం మాత్రం కరోనా కాదని చెబుతోంది.

Kim Jong Un ‘seriously ill’ : కిమ్‌ జోంగ్ అనారోగ్యానికి దక్షిణ కొరియా కారణం అంటూ మండిపడ్డ సోదరి యో జోంగ్

 

ట్రెండింగ్ వార్తలు