North Korea: నార్త్ కొరియాకు వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమన్న అమెరికా.. కిమ్ ఏమన్నాడంటే..

నార్త్ కొరియాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్ వ్యాప్తి వల్ల ఆ దేశంలో పది రోజుల్లోనే 67 మంది మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ 2లక్షల మందికిపైగా జ్వరంతో బాధపడుతున్న వారిని వైద్యులు గుర్తిస్తున్నారు. ఆదివారం ఆ సంఖ్య తగ్గడంతో కొంత...

North Korea: నార్త్ కొరియాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్ వ్యాప్తి వల్ల ఆ దేశంలో పది రోజుల్లోనే 67 మంది మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ 2లక్షల మందికిపైగా జ్వరంతో బాధపడుతున్న వారిని వైద్యులు గుర్తిస్తున్నారు. ఆదివారం ఆ సంఖ్య తగ్గడంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు. గడిచిన వారంరోజుల్లో తొలిసారిగా రెండు లక్షల కంటే తక్కువ మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 1.86లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నట్లు అధివారం అధికారులు వెల్లడించారు. వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కిమ్ కు కీలక సూచన చేశారు.

North Korea: నార్త్‌ కొరియాలో కరోనా విలయం.. కషాయాలు, టీలు తాగండి అంటూ సలహా

కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న ఉత్తర కోరియాలోని ప్యోంగాంగ్ తో పాటు చైనాకు వ్యాక్సినేషన్లు అందజేస్తామని జో బైడెన్ చెప్పారు. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సున్ యోల్ తో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సమావేశం అయ్యారు. ఈ వైరస్ ను ఎదుర్కోవడం కోసం ఉత్తర కొరియాకు సాయం చేసేలా అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. అయితే ఉత్తర అధ్యక్షుడు నిజాయితీగా ఉంటే ఆయనతో భేటీ అయ్యేందుకు కూడా తాను సిద్ధమని బైడెన్ పేర్కొన్నారు. అయితే వ్యాక్సిన్ విషయంలో ఉత్తర కొరియా నుంచి ఎటువంటి స్పందన రాలేదని జో బైడెన్ అన్నారు.

North Korea Corona Terror : 7 రోజుల్లో 10లక్షల కరోనా కేసులు.. ఆ దేశంలో కొవిడ్ కల్లోలం

ఇదిలా ఉంటే ఇరువురు నాయకులు తమతమ దేశాల్లో సైనిక విన్యాసాలను ముమ్మరం చేశామని ప్రకటించడంతో కిమ్‌కి ఆగ్రహం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు యూన్, బైడెన్ ఇద్దరూ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించడమే కాకుండా సెమీకండక్టర్, బ్యాటరీల వంటి పరిశ్రమల సరఫరా గొలుసులను స్థిరీకరించడానికి సహకరించడానికి ఒప్పందాలు చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు