NW China Quake : చైనాలో భారీ భూకంపం.. వరుసగా 3 సార్లు.. తీవ్రత 6.9గా నమోదు..!

డ్రాగన్ చైనాలో భారీ భూకంపం సంభవించింది. ప్రావిన్షియల్ రాజధానిలో కింగ్ హైప్రావిన్స్‌లో శనివారం  (జనవరి 8) తెల్లవారుజామున 1:45 గంటలకు (బీజింగ్ టైమ్) భూమి కంపించింది. 

NW China Quake : డ్రాగన్ చైనాలో భారీ భూకంపం సంభవించింది. ప్రావిన్షియల్ రాజధానిలో కింగ్ హైప్రావిన్స్‌లో శనివారం  (జనవరి 8) తెల్లవారుజామున 1:45 గంటలకు (బీజింగ్ టైమ్) భూమి కంపించింది.  రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 గా నమోదైందని  అధికారులు వెల్లడించారు. వాయ‌వ్య దిశ‌లోని క్విఘాయిలో ఈ భూకంపం వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు.

జినింగ్ నగరంలో భూప్రకంపనలు బలంగా ఉన్నట్టు తెలిపారు. మెన్ యువాన్ కౌంటీలో భూమి ఒక్కసారిగా షేక్ అయింది. రాత్రి సమయంలో భూకంపం రావడవంతో ఇళ్లలో నుంచి మనుషులు బయటకు పరుగులు తీశారు. జంతువులు బెదిరిపోయాయి. భూకంపం సమయంలో రికార్డు అయిన దృశ్యాలు సీసీటీవీ ఫూటేజ్ బయటకు వచ్చింది. అందులో మూడు సార్లు భూప్రకంపనలు నమోదైనట్టు అధికారులు గుర్తించారు. మొదటిసారి 4.1గా నమోదైన భూకంప తీవ్రత.. ఆ తర్వాత వరుసగా  3.0, 5.1 తీవ్ర‌త‌తో రిక్టర్ స్కేలుపై నమోదైంది.

మొత్తంగా మూడు సార్లు భూమి వణికిపోయినట్టు భూకంప వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. జినింగ్ సిటీకి 136 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొన్నారు. 10కిలోమీటర్ల లోతుగా భూకంపం సంభవించిందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఘాన్సూ, షాంగ్జీ, నింగ్జాయి ప్రావిన్సు ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. బలమైన భూప్రకంపనల ధాటికి ఏమైనా ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగిందా లేదా అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

Read Also : Snow Storm: మూడో రోజూ మూతపడ్డ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి

ట్రెండింగ్ వార్తలు