Germany : చనిపోయిన భార్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 83 ఏళ్ల వృద్ధుడు ఏం చేశాడంటే..

ఆయన వయసు 83.. భార్య చనిపోయి 4 ఏళ్లైంది.. ఆమెను మర్చిపోలేకపోయాడు. ఆమెతో కలిసి తిరిగిన రోజుల్ని గుర్తు చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏం చేశాడు?

Germany

Germany : 83 సంవత్సరాలు అంటే వృద్ధ్యాప్యం.. ఇంటి పట్టునే ఉంటూ కాలం వెళ్లదీసే వయసు.. ఇలా అనుకుంటాం కదా.. కానీ ఓ పెద్దాయన 4 సంవత్సరాల క్రితం చనిపోయిన తన భార్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 20 ఏళ్ల క్రితం తాము గడిపిన ప్రదేశాలన్నీ తిరిగాడు. అదే సమయంలో పెద్దాయనను కలిసిన జర్మనీకి చెందిన జోయెల్ ఆష్టన్ అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు.

Kerala : కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్.. ‘తనయుడి జ్ఞాపకాలు సజీవం’గా ఉండాలని ఓ తండ్రి వినూత్న ఆలోచన

జర్మనీకి చెందిన ఓ 83 ఏళ్ల పెద్దాయనకు 4 సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. భార్య జ్ఞాపకాలతో కాలం గడుపుతున్న ఆయన 20 సంవత్సరాల క్రితం ఆమెతో కలిసి తిరిగిన ప్రదేశాలకు వెళ్లి రావాలని నిర్ణయించుకున్నాడు. అంతే జర్మనీ నుంచి స్కాట్లాండ్ వరకూ తిరుగుతూ గడిపాడు. అదే సమయంలో హనీమూన్ ట్రిప్‌లో ఉన్న జోయెల్ ఆష్టన్ అనే వ్యక్తి  ఆయనను కలిశాడు. అనుకోకుండా పెద్దాయన ఆయన భార్య స్టే చేసిన ఇంట్లోనే ఆష్టన్, అతని భార్య ఉన్నారట. ఇక పెద్దాయన ఆస్టన్‌కు తన భార్యతో ఉన్న జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాడు. కొన్ని గంటలు వారిద్దకూ మాట్లాడుకున్నాక  పెద్దాయన అక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఇక ఆస్టన్ (@_JoelAshton) ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు.

Bhanupriya : మెమరీ లాస్‌తో బాధపడుతున్న భానుప్రియ.. ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

‘మరల ఆ పెద్దాయనను కలుస్తానో లేదో తెలియదు కానీ ఇద్దరం ఈమెయిల్స్ ఎక్చేంజ్ చేసుకున్నాం. నా భార్య, నేను ఆయన ఉన్న చోటుకి వెళ్లి కలవాలని అనుకున్నాం’ అంటూ ఆస్టన్ షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఖచ్చితంగా ఆ పెద్దాయనను వెళ్లి కలిసిరండి.. మీ ట్వీట్, మీ కలయకి అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. వయసు మీద పడ్డా భార్యతో ఉన్న తీయని  జ్ఞాపకాలు అతడిని అంత దూరం ప్రయాణం చేయించాయని చాలామంది కామెంట్లు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు