Affordable House Market : అఫర్డబుల్ హౌసింగ్‌కు మారు పేరుగా హైదరాబాద్

Affordable House Market : ఇక ప్రాజెక్టుల లాంచింగ్‌ సమయంలోనే ప్రాపర్టీలు ఎప్పుడు హ్యాండోవర్‌ చేయనున్నారో డెవలపర్లు చెబుతున్నారు. హ్యాండోవర్‌ సమయంలో ప్రాపర్టీ విలువ ఎంతో ఉండొచ్చే అంచనా వేస్తున్న డెవలపర్లు..

Affordable House Market

Affordable House Market : ఎన్నో ఏళ్లుగా అఫర్డబుల్ హౌసింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్‌లో.. ప్రస్తుతం ప్రాపర్టీ విలువలు పెరుగుతున్నాయి. అయితే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ప్రాపర్టీల ధరలు ఇప్పటికీ ఇంకా తక్కువగానే ఉండటం ప్లస్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. అయితే వెస్ట్ జోన్‌తోపాటు ఈస్ట్ జోన్‌లోని ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరిగాయి. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న ధరతో పోలిస్తే హ్యాండోవర్‌ సమయంలో ఎస్‌ఎఫ్‌టీ ధర వెయ్యి నుంచి 15వందల రూపాయలు పెరుగుతోంది. కొన్ని ప్రాజెక్టుల్లో అయితే ఈ విలువ మరింత అధికంగా ఉంది.

Read Also : Dream Home : హైదరాబాద్‌లో ఇళ్లు కొనేటప్పుడు ధరలు మాత్రమే కాదు.. డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి

ఇక ప్రాజెక్టుల లాంచింగ్‌ సమయంలోనే ప్రాపర్టీలు ఎప్పుడు హ్యాండోవర్‌ చేయనున్నారో డెవలపర్లు చెబుతున్నారు. హ్యాండోవర్‌ సమయంలో ప్రాపర్టీ విలువ ఎంతో ఉండొచ్చే అంచనా వేస్తున్న డెవలపర్లు.. అమౌంట్‌ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకే ప్రాపర్టీలను అమ్ముతున్నాయి. గత ఐదారు నెలల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో సగటున ప్రాపర్టీ ధరలు 12శాతం పెరిగాయని పలు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థలు రిపోర్ట్‌ను విడుదల చేశాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మాత్రం అత్యధికంగా 30శాతం వరకు పెరుగుదల నమోదైంది.

బెంగళూర్‌లో 28శాతం, అహ్మదాబాద్, పూణే నగరాల్లో 13 శాతం, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో 7 శాతం ధరలు పెరిగాయి. మెటీరియల్‌ కాస్ట్‌, భూ విలువలు భారీగా పెరగడంతో ప్రాపర్టీల ధరలు ఎగబాకాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే హైదరాబాద్‌లో ధరలు పెరిగినప్పటికీ ఇళ్లకు మాత్రం డిమాండ్‌ తగ్గలేదని తెలిపాయి. హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేక పరిస్థితులు.. ఇక్కడి మార్కెట్‌ డిమాండ్‌కు ప్రధాన కారణమని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాది కాలం నుంచి ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్స్‌, ఇండిపెండెంట్‌ ఇళ్ల కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్స్‌ భారీగా పెరిగాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈ రంగంలో చక్కని రిటర్న్స్‌ వస్తుండటం కూడా రియాల్టీకి ప్లస్‌ పాయింట్‌గా మారింది. ఇక హైదరాబాద్‌లో పెరుగుతోన్న ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు ప్రాపర్టీ కొనుగోళ్లు డిమాండ్‌కు ఊతమిస్తున్నాయి.

Read Also : Real Estate Business : రియాల్టీ రంగంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం

ట్రెండింగ్ వార్తలు