Green Gram Cultivation : పెసరసాగుతో లాభాలు ఆర్జిస్తున్న రాంపూర్ రైతులు
Green Gram Cultivation : ఈ మధ్య కాలంలో తృణధాన్యాల సాగు రైతులకు ఆసరాగా నిలుస్తుంది. వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో కృషిచేస్తుంది.
Green Gram Cultivation : దశాబ్దం క్రితం వరకు పల్లె పల్లెలో పెసర పంట సాగు చేసే రైతులు అధికంగా ఉండేవారు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండి.. అతితక్కువ కాలంలోనే పంట చేతికి వస్తుండటంతో జహీరబాద్ జిల్లా, థరూర్ మండలం, రాంపూర్ గ్రామంలో రైతులు అనాదిగా పెసర పంటలు సాగుచేస్తూ… మంచి లాభాలు గడిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో తృణధాన్యాల సాగు రైతులకు ఆసరాగా నిలుస్తుంది. వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో కృషిచేస్తుంది. 2024-25 ఖరీఫ్ సీజన్ పంటలకు అందిస్తున్న కనీస మద్దత్తు ధరలో తృణధాన్యాలకు అధిక ప్రాధ్యాన్యత ఇస్తూ కొత్త ధరలను ఆమోదించడం జరిగింది. అయితే ఇవేవి తెలియకుండానే… అనాధిగా పెసర పంటను సాగుచేస్తున్నారు జహీరబాద్ జిల్లా, థరూర్ మండలం, రాంపూర్ గ్రామంలో రైతులు.
రాంపూర్ గ్రామంలో దాదాపు 300 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో దాదాపు 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఇక్కడి రైతులు ఖరీఫ్ లేదా రబీలో ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో పెసలు సాగుచేయడం ఆనవాయితి. శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండి.. అతితక్కువ కాలంలోనే పంట చేతికి వస్తుండటం.. ఇటు మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుండటంతో గిరిజన రైతులు ఈ పంటసాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే ఈ పంటసాగుతో మంచి లాభాలు వస్తున్నాయంటున్నారు.