Real Estate Business : రియాల్టీ రంగంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం

Real Estate Business : గత ఏడాది కాలంలో హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో పెద్దసంఖ్యలో భూ క్రయవిక్రయాలు జరిగాయి. గతేడాది ఈ ప్రాంతంలో ఓపెన్‌ ప్లాట్లు, ఇండిపెండెంట్‌ ఇళ్లు, ఫ్లాట్స్‌ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది.

Huge Income For Govt in Real Estate Business

Real Estate Business : తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం జోరు మీదుంది. చిన్న చిన్న పట్టణాల నుంచి హైదరాబాద్ వరకు అన్ని ప్రాంతాల్లోనూ  ఆయా పరిస్థితులకు అనుగుణంగా డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో 80 నుంచి 90 శాతం వరకు రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు జరుగుతున్నాయి.

Read Also : Dream Home : ముచ్చర్లలో కలల నగరం.. మరో సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్‌!

లే అవుట్లలోని ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇల్లు, అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్ల అమ్మకాల ద్వారా తెలంగాణ సర్కార్‌కు భారీగా ఆదాయం వస్తోంది. ఈ రంగంలో ప్రతి ఏటా ప్రభుత్వ ఆదాయం పెరగడం.. ఇండస్ట్రీ దూకుడుకు సంకేతాలుగా చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉండే జిల్లాలతోపాటు హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది.

జీహెచ్‌ఎంసీదే సింహభాగం వాటా : 
గత ఏడాది కాలంలో హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో పెద్దసంఖ్యలో భూ క్రయవిక్రయాలు జరిగాయి. గతేడాది ఈ ప్రాంతంలో ఓపెన్‌ ప్లాట్లు, ఇండిపెండెంట్‌ ఇళ్లు, ఫ్లాట్స్‌ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2014-15లో ప్రభుత్వానికి 2వేల 746 కోట్ల ఆదాయం రాగా… గత ఆర్థిక సంవత్సరంలో ఆ రెవెన్యూ 14 వేల 588 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు ఐదున్నర రెట్ల ఆదాయం పెరిగిందన్నమాట. ఇందులో నాన్‌ అగ్రికల్చర్‌ రిజిస్ట్రేషన్స్‌ నుంచి వచ్చిన ఆదాయం అధికంగా ఉంది. దీనిలో హెచ్‌ఎండీఏ పరిధిలోనే ప్రభుత్వ ఖజానాకు 7వేల 5వందల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.

ఇక హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్ల అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. రిజిస్ట్రేషన్‌ శాఖలోనే టాప్‌-30 ఎస్‌ఆర్ఓల్లో ఎక్కువగా విశ్వనగరం పరిధిలోనే ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కువగా ఆదాయం రాబడుతోన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలున్నాయి.

ఇవే కాకుండా నిర్మాణ రంగం కారణంగా అనేక ముడి సరుకుల విక్రయంపై ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని రియాల్టీ రంగ బలోపేతానికి కేటాయిస్తే.. ఈ రంగం రాబోయే కాలంలో ప్రభుత్వం ఆదాయం మరింత పెరగనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.

గత పదేళ్లలో అప్పుడప్పుడు మినహాయిస్తే ఓవరాల్‌గా రియాల్టీ రంగం చక్కని గ్రోత్‌ను నమోదు చేస్తోంది. రిజిస్ట్రేషన్‌ ద్వారా ఆదాయం ప్రభుత్వానికి కల్పతరువుగా మారింది. ముఖ్యంగా ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీతో పాటు పరిసర జిల్లాల్లో ప్రభుత్వానికి 4వేల 670 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇది 270 కోట్లు అధికమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

Read Also : Dream Home : హైదరాబాద్‌లో ఇళ్లు కొనేటప్పుడు ధరలు మాత్రమే కాదు.. డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి

ట్రెండింగ్ వార్తలు