House Of Cards : అమెరికన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 8 గంటల్లో 54-అంతస్తుల హౌస్ ఆఫ్ కార్డ్‌లు నిర్మించాడు!

House Of Cards : ప్రసిద్ధ కార్డ్-స్టాకింగ్ కళాకారుడు కూడా. అనేక మందిని ఆకర్షించిన అతడు సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించాడు. కేవలం 8 గంటల్లో, బెర్గ్ 54-లెవల్ కార్డ్‌ హోం నిర్మించాడు.

US Man Builds 54-Story House Of Cards In 8 Hours, Breaks World Record

House Of Cards : బ్రయాన్ బెర్గ్ ఒక అమెరికన్ ఆర్కిటెక్ట్.. ప్రసిద్ధ కార్డ్-స్టాకింగ్ కళాకారుడు కూడా. అనేక మందిని ఆకర్షించిన అతడు సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించాడు. కేవలం 8 గంటల్లో, బెర్గ్ 54-లెవల్ కార్డ్‌ హోం నిర్మించాడు. తన కెరీర్‌‌లోనే ఇదో అద్భుతమైన ఫీట్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) అధికారిక అకౌంట్ బెర్గ్ వీడియోను పోస్ట్ చేసింది.

Read Also : Viral Video : బాబోయ్..! మహిళలూ బైక్ పై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త.. ఈ వీడియో చూడండి..

టైమర్ టిక్ చేయడంతో.. బెర్గ్ కార్డ్‌లను జాగ్రత్తగా సమీకరించాడు. కార్డులను స్థిరంగా పేర్చి అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడు. జీడబ్ల్యూఆర్ న్యాయనిర్ణేత థామస్ బ్రాడ్‌ఫోర్డ్ పరిశీలనలో బెర్గ్ సవాలును పూర్తి చేశాడు. అతను ఫినిషింగ్ టచ్‌గా కార్డ్ టవర్ పైన మొబైల్ ఫోన్‌ను కూడా చేర్చాడు.

జీడబ్ల్యూఆర్ వెబ్‌సైట్ ప్రకారం.. :
బెర్గ్ జిగురు, వైరింగ్ లేదా ఎలాంటి మెటల్ సపోర్టులను ఉపయోగించకుండా ఆకట్టుకునే కార్డ్ టవర్‌ను నిర్మించాడు. ఈ అసాధారణమైన ఫీట్‌ని సాధించడానికి అతనికి గది దాదాపు గాలి చొరబడకుండా ఉండాలి. ప్రక్రియ అంతటా కార్డ్‌లను స్థిరంగా ఉంచడానికి అధిక స్థాయిలో తేమను ఉండేలా చూడాలి. బెర్గ్‌కు రికార్డులు నెలకొల్పడం కొత్త కాదు.

ఇంతకుముందు చాలాసార్లు ఎత్తైన ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్‌గా రికార్డు సాధించాడు. అతని ప్రస్తుత రికార్డు 7.86 మీటర్లు (25 అడుగుల 9 అంగుళాలు), 2007 నుంచి అజేయంగా ఉంది. అతను వాస్తవానికి 1992లో ఈ రికార్డును నెలకొల్పాడు. అప్పటి నుంచి అనేక విజయాలను పదే పదే అధిగమించాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయింగ్ కార్డ్ నిర్మాణాన్ని బెర్గ్ కూడా క్రియేట్ చేశాడు. 10.39 మీటర్లు (34 అడుగుల 1 అంగుళం) పొడవు, 2.88 మీటర్లు (9 అడుగుల 5 అంగుళాలు) ఎత్తు, 3.54 మీటర్లు (11 అడుగుల 7 అంగుళాలు) వెడల్పు భవనం అంత పరిమాణంలో ఉంటుంది. అయితే, ఈ రికార్డును భారత్‌కు చెందిన అర్నవ్ డాగా గత ఏడాదిలో అధిగమించారు. దీని నిర్మాణం 12.21 మీటర్లు (40 అడుగులు) పొడవు, 3.47 మీటర్లు (11 అడుగుల 4 అంగుళాలు) ఎత్తు, 5.08 మీటర్లు (16 అడుగుల 8 అంగుళాలు) వెడల్పుతో కొలుస్తారు.

Read Also : Viral Video : ఈమె గుండె గట్టిదే.. చెరువులో భారీ మొసలికి ఎలా ఆహారం తినిపిస్తుందో చూడండి..!

ట్రెండింగ్ వార్తలు