Viral Video : ఈమె గుండె గట్టిదే.. చెరువులో భారీ మొసలికి ఎలా ఆహారం తినిపిస్తుందో చూడండి..!

Viral Video : ఆ వీడియోలో మహిళ చెరువులోకి వెళ్లి మొసలిని ఆహారం వేస్తూ కనిపించింది. పైగా చేతిలో కర్ర పట్టుకుని మొసలి నోటికి అడ్గుగా పెడుతూ ఆహారం తినిపించింది.

Viral Video : ఈమె గుండె గట్టిదే.. చెరువులో భారీ మొసలికి ఎలా ఆహారం తినిపిస్తుందో చూడండి..!

Video_ Woman, Standing In A Pond, Feeds Massive Alligator ( Image Source : Google )

Updated On : August 25, 2024 / 8:50 PM IST

Viral Video : అదో భారీ మొసలి.. బయట ఉంటేనే భయంతో పరుగులు పెడతారు. అలాంటిది నీళ్లలో దానికి బలం ఎక్కువ. దొరికితే అంతే.. ఎలిగేటర్‌కు ఆహారం అయిపోతారంతే.. సాధారణంగా చాలా మంది వ్యక్తులు ఎలిగేటర్‌ ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడిపోతుంటారు. అయినప్పటికీ, కొంతమంది మాత్రం సాహసోపేతమైన పనులు చేస్తుంటారు. అలాగే, ఓ మహిళ తన ప్రాణాలను లెక్కచేయకుండా చెరువులో భారీ ఎలిగేటర్ ముందు నిలబడింది.

అంతటితో ఆగలేదు. దానికి ఆహారం కూడా తినిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మహిళ చెరువులోకి వెళ్లి మొసలిని ఆహారం వేస్తూ కనిపించింది. పైగా చేతిలో కర్ర పట్టుకుని మొసలి నోటికి అడ్గుగా పెడుతూ ఆహారం తినిపించింది. మొసలిని చూస్తుంటే ఏదో బాగా ఆమెకు అలవాటు అయినట్టుగా కనిపిస్తుంది. నోరు వెళ్లబెడుతూ మహిళ అందించిన ఆహారాన్ని చక్కగా తినేస్తోంది.

చెరువులో ఓ మహిళ ఎలిగేటర్‌ ఈత కొడుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో కనిపించే మహిళ బెలోవింగ్ ఎకర్స్ గాబీ అనే జంతు రక్షకురాలు. ఎలిగేటర్‌లతో ఆడుకోవడంటే ఆమె చాలా ఇష్టం.

ఇటీవలి వీడియోలో బెల్లా అనే భారీ ఎలిగేటర్‌తో చెరువులో ఈత కొడుతూ కనిపించింది. ఈ వీడియోలో గాబీ, ఆమె బృందం బెల్లా మొసలిని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి ఆహారం తినిపించినప్పుడు అది ఆగ్రహానికి గురికాదు. గాబీ నీటిలోకి ప్రవేశించిన వెంటనే బెల్లా ఆమె వద్దకు రాగా కర్రతో దాన్ని నియంత్రిస్తుంది. ఆమె ఎలిగేటర్‌కు ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Gabby ? (@gabbynikolle)

ఈ వీడియోకు ఇప్పటివరకూ 3 లక్షల వ్యూస్, 9 వేల లైక్‌లను పొందింది. భారీ మొసలికి ఆహారం ఇవ్వడం లేదా ఈత కొట్టడం చూసేందుకు చాలా చక్కగా ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ఒక మొసలిని మచ్చిక చేసుకోవడం చాలా ఏళ్లు పడుతుందని మరో యూజర్ తెలిపాడు. ఒక చిన్న కర్రతో ఎలిగేటర్‌ను కంట్రోల్ చేయడం చాలా ధైర్యం కావాలని మరో యూజర్ చెప్పారు.

Read Also : Viral Video : ఆపిల్ ఐఫోన్ కోసం కొడుకు నిరాహారదీక్ష.. కండిషన్ పెట్టి కొనిచ్చిన పూలు అమ్మే తల్లి..!